తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఎందుకు విపరీతంగా భయపడతారు? తాము జీవితంలో విఫలం కావడం వల్లనేనా? తమ పిల్లలు దొంగలుగా తాగుబోతులుగా, ఆకతాయిలుగా మారుతారు. అమ్మనాన్నలకెందుకింత భయం? అంతరాంతరాలలో ఏ రూపంలోనైనా ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉండడం వల్లనేనా? తల్లిదండ్రులకు పిల్లల క్రమశిక్షణ గురించి ఎందుకంత జాగ్రత్త? ఆ క్రమశిక్షణను నిత్యజీవితంలో తామెప్పుడూ అంగీకరించి ఉండక పోవడం వల్లనేనా?
ఇలా తల్లిదండ్రుల్ని తరచి తరచి చూచి పిల్లలకి వీళ్ళే గొప్ప సమస్యలని అంతిమ పరిష్కారానికేమీ రాడు నీల్. దీనికే కారణాలను వెతుకుతాడు. "మొత్తం సామాజిక వ్యవస్థను ప్రస్తావించకుండా విద్యను గురించి చర్చించడం సాధ్యం కాదనీ, ప్రభుత్వమే విద్యపై నియంత్రణ సాగించడమనేది ప్రగతికి ప్రతిబంధకమనీ, అసలు విద్యారంగ ప్రముఖులతో పోలిస్తే చాలా వెనకబడి ఉంద" ని స్పష్టంగా ఘాటుగా తీర్పునిస్తాడు.
క్లాసురూంలో సివిక్సు, చరిత్ర పాఠాలు చెప్పగానే మంచి పేరులు తమవై పోతాయనే మాస్టార్లకు యుద్ధ సన్నద్ధాలకు ఖజానానంతా ఖాళీచేస్తూ, ముష్టి విదిలింపుల బడ్జెటుతో అందరికీ విద్యనూ అరచేతిలో చూపిస్తున్న పాలకులకూ, సైన్సు ముసుగులో మతాన్ని, పరిశుభ్రత పేరుతో నైతికతను దొడ్డిదారిన దూరుస్తున్న మత పండితులకూ ఈ పుస్తకం కళ్ళు తెరిపించే పాఠ్య గ్రంథం.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఎందుకు విపరీతంగా భయపడతారు? తాము జీవితంలో విఫలం కావడం వల్లనేనా? తమ పిల్లలు దొంగలుగా తాగుబోతులుగా, ఆకతాయిలుగా మారుతారు. అమ్మనాన్నలకెందుకింత భయం? అంతరాంతరాలలో ఏ రూపంలోనైనా ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉండడం వల్లనేనా? తల్లిదండ్రులకు పిల్లల క్రమశిక్షణ గురించి ఎందుకంత జాగ్రత్త? ఆ క్రమశిక్షణను నిత్యజీవితంలో తామెప్పుడూ అంగీకరించి ఉండక పోవడం వల్లనేనా? ఇలా తల్లిదండ్రుల్ని తరచి తరచి చూచి పిల్లలకి వీళ్ళే గొప్ప సమస్యలని అంతిమ పరిష్కారానికేమీ రాడు నీల్. దీనికే కారణాలను వెతుకుతాడు. "మొత్తం సామాజిక వ్యవస్థను ప్రస్తావించకుండా విద్యను గురించి చర్చించడం సాధ్యం కాదనీ, ప్రభుత్వమే విద్యపై నియంత్రణ సాగించడమనేది ప్రగతికి ప్రతిబంధకమనీ, అసలు విద్యారంగ ప్రముఖులతో పోలిస్తే చాలా వెనకబడి ఉంద" ని స్పష్టంగా ఘాటుగా తీర్పునిస్తాడు. క్లాసురూంలో సివిక్సు, చరిత్ర పాఠాలు చెప్పగానే మంచి పేరులు తమవై పోతాయనే మాస్టార్లకు యుద్ధ సన్నద్ధాలకు ఖజానానంతా ఖాళీచేస్తూ, ముష్టి విదిలింపుల బడ్జెటుతో అందరికీ విద్యనూ అరచేతిలో చూపిస్తున్న పాలకులకూ, సైన్సు ముసుగులో మతాన్ని, పరిశుభ్రత పేరుతో నైతికతను దొడ్డిదారిన దూరుస్తున్న మత పండితులకూ ఈ పుస్తకం కళ్ళు తెరిపించే పాఠ్య గ్రంథం.© 2017,www.logili.com All Rights Reserved.