పిల్లల్ని నిద్ర పుచ్చాలంటే ఏ దయ్యాల పేరుతోనో, పోలీసుల పేరుతోనో భయపెట్టాలి. అన్నం తినిపించాలంటే నాన్ననో, బూచినో చూపించి భయపెట్టాలి. క్రమశిక్షణ కోసమైతే ఎంత భయపెట్టినా తక్కువే. అడుగడుగునా ఇలా భయంతోనే పిల్లల్ని పెంచే మనం ఒడిలో మాత్రం భయంతో తప్ప చదువు రాదనీ ఎందుకనుకోకుండా ఉంటాం? అందువల్ల భయమూ బడి జంట పదాలయ్యాయి.
జీవితమంతా పిల్లల కోసం, పిల్లల చదువుల మీదా వికాసం మీదా చేసిన ప్రయోగాల కోసం వెచ్చించిన నీల్ మనకోసం అంటే మన పెద్దలకోసం చాలా చెపుతాడు. ఒక్కోసారి తీవ్రంగా కోప్పడి మందలిస్తాడు కూడా. ఆవేదనని ఆగ్రహంగా కూడా వ్యక్తం చేస్తాడు. ఈ పుస్తకం రోజూవారీగా మనం పిల్లల్ని ఎంత తప్పుడు దృష్టితో చూస్తున్నామో చెపుతుంది. మనల్ని ఎక్కడో దాక్కొని తరచి చూసి మరీ చెపుతున్నాడా అనిపిస్తుంది. ఓ వైపు పిల్లల్ని భరించలేనంతగా ప్రేమించేస్తున్నాం. మన ఆశలన్నీ వాళ్ళ మీద కుమ్మరించేస్తున్నాం. పిల్లల ప్రతి అడుగునూ భూతద్దంలో చూసి భయపడి పోతున్నాం.
ఇదంతా మనలో లోపమంటాడు నీల్. పిల్లలు అద్భుతమైన వాళ్ళని అతని నమ్మకం. వాళ్ళ సమస్యంతా మనమేనని అతని విశ్వాసం. ఇంత మంచి పుస్తకం నీల్ రాసి దశాబ్దాలు గడిచాయి. ఇప్పుడు ప్రజాశక్తి బాధ్యతగా దీన్ని సుంకర గారి చేత అనువాదింప జేసి మనకందిస్తోంది. ప్రచురణ కర్తలకూ, అనువాదకులకూ ఇలాంటి పుస్తకం తెచ్చినందుకు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే.
పిల్లల్ని నిద్ర పుచ్చాలంటే ఏ దయ్యాల పేరుతోనో, పోలీసుల పేరుతోనో భయపెట్టాలి. అన్నం తినిపించాలంటే నాన్ననో, బూచినో చూపించి భయపెట్టాలి. క్రమశిక్షణ కోసమైతే ఎంత భయపెట్టినా తక్కువే. అడుగడుగునా ఇలా భయంతోనే పిల్లల్ని పెంచే మనం ఒడిలో మాత్రం భయంతో తప్ప చదువు రాదనీ ఎందుకనుకోకుండా ఉంటాం? అందువల్ల భయమూ బడి జంట పదాలయ్యాయి. జీవితమంతా పిల్లల కోసం, పిల్లల చదువుల మీదా వికాసం మీదా చేసిన ప్రయోగాల కోసం వెచ్చించిన నీల్ మనకోసం అంటే మన పెద్దలకోసం చాలా చెపుతాడు. ఒక్కోసారి తీవ్రంగా కోప్పడి మందలిస్తాడు కూడా. ఆవేదనని ఆగ్రహంగా కూడా వ్యక్తం చేస్తాడు. ఈ పుస్తకం రోజూవారీగా మనం పిల్లల్ని ఎంత తప్పుడు దృష్టితో చూస్తున్నామో చెపుతుంది. మనల్ని ఎక్కడో దాక్కొని తరచి చూసి మరీ చెపుతున్నాడా అనిపిస్తుంది. ఓ వైపు పిల్లల్ని భరించలేనంతగా ప్రేమించేస్తున్నాం. మన ఆశలన్నీ వాళ్ళ మీద కుమ్మరించేస్తున్నాం. పిల్లల ప్రతి అడుగునూ భూతద్దంలో చూసి భయపడి పోతున్నాం. ఇదంతా మనలో లోపమంటాడు నీల్. పిల్లలు అద్భుతమైన వాళ్ళని అతని నమ్మకం. వాళ్ళ సమస్యంతా మనమేనని అతని విశ్వాసం. ఇంత మంచి పుస్తకం నీల్ రాసి దశాబ్దాలు గడిచాయి. ఇప్పుడు ప్రజాశక్తి బాధ్యతగా దీన్ని సుంకర గారి చేత అనువాదింప జేసి మనకందిస్తోంది. ప్రచురణ కర్తలకూ, అనువాదకులకూ ఇలాంటి పుస్తకం తెచ్చినందుకు ఎన్ని అభినందనలు చెప్పినా తక్కువే.© 2017,www.logili.com All Rights Reserved.