మన మనస్సు యొక్క స్వభావమ్ మనం గిడి ఏ జీవిత నాణ్యతను నిర్ధారిస్తుంది.. మనస్సే మన సర్వోత్తమ మిత్రుడుగా ఉండొచ్చు లేదా మన స్సే మన బద్ద శత్రువుగా అయిపోవచ్చు. నియంత్రణ లేకుండా ప్రవర్తించే మనస్సు, మన అంతర్గత ప్రశాంతతని కొల్లగొట్టి, మన ప్రతి ప్రయోజనకర ప్రయత్నాన్ని నిర్వీర్యం చేస్తుంది. అయినా సరే, సరైన జ్ఞానము, శిక్షణ, మరియు క్రమశిక్షణతో మనస్సు యొక్క అనంతమైన సామర్ధ్యాన్ని వెలికితీయటం సాధ్యమే.
ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అనే ఈ పుస్తకంలో, స్వామీ ముకుందానంద గారు, మానవ మనస్సు యొక్క నాలుగు విభిన్న అంశాలను వివరిస్తూ, దానిపై పట్టు సాధించటానికి స్పష్టమైన మార్గాన్ని చూపించారు. చమత్కారమైన వృత్తాంతాలతో, నిజ జీవిత ఉదాహరణలతో, మరియు వేద శాస్త్రాలనుండి కథలతో, వారు పాఠకులకు, తమ అంతర్గత పోరాటంలో విజయం సాధించటానికి మృదువుగా దిశానిర్దేశం చేస్తున్నారు.
స్వామీ ముకుందానంద గారు, ఐఐటి మరియు ఐఐఎంలలో చదువుకున్న భారత దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గురువు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారి శిక్షణలో, వేద శాస్త్రాలను అభ్యసించిన స్వామీజీ వారు, ఇప్పుడు, సర్వత్రా జనులకు, వాస్తవికమైన, నిత్యశాశ్వత ఆనందం యొక్క పథాన్ని వివరిస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. తీరిక లేకుండా ఉన్న తమ కార్యక్రమాల నడుమ, వారు గ్రంథాలను, వ్యాఖ్యానాలను వ్రాస్తూ, CD మరియు DVDలను రికార్డు చేస్తూ, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త సమూహాలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. స్వామీజీ వారి ఉపన్యాసాలు వినోదభరితంగా ఉంటాయి, వారు చెప్పే విషయాలు తర్కబద్దంగా, స్పష్టంగా ఉంటాయి, అన్నింటికంటే ముఖ్యంగా, వారి సలహాలు ఆచరణాత్మకంగా ఉంటాయి. వారి ఉపన్యాసాలు చాలా ప్రజాదరణ పొందాయి, మరియు వాటిల్లో, మనస్సుని జయించటం, యోగా ద్వారా మంచి ఆరోగ్యం, ధ్యానము మరియు ఆధ్యాత్మికత మరియు రోజువారీ జీవనంలో కర్మయోగము వంటి అనేకానేక
విషయాలు పొందు పరచబడి ఉంటాయి.
మన మనస్సు యొక్క స్వభావమ్ మనం గిడి ఏ జీవిత నాణ్యతను నిర్ధారిస్తుంది.. మనస్సే మన సర్వోత్తమ మిత్రుడుగా ఉండొచ్చు లేదా మన స్సే మన బద్ద శత్రువుగా అయిపోవచ్చు. నియంత్రణ లేకుండా ప్రవర్తించే మనస్సు, మన అంతర్గత ప్రశాంతతని కొల్లగొట్టి, మన ప్రతి ప్రయోజనకర ప్రయత్నాన్ని నిర్వీర్యం చేస్తుంది. అయినా సరే, సరైన జ్ఞానము, శిక్షణ, మరియు క్రమశిక్షణతో మనస్సు యొక్క అనంతమైన సామర్ధ్యాన్ని వెలికితీయటం సాధ్యమే. ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అనే ఈ పుస్తకంలో, స్వామీ ముకుందానంద గారు, మానవ మనస్సు యొక్క నాలుగు విభిన్న అంశాలను వివరిస్తూ, దానిపై పట్టు సాధించటానికి స్పష్టమైన మార్గాన్ని చూపించారు. చమత్కారమైన వృత్తాంతాలతో, నిజ జీవిత ఉదాహరణలతో, మరియు వేద శాస్త్రాలనుండి కథలతో, వారు పాఠకులకు, తమ అంతర్గత పోరాటంలో విజయం సాధించటానికి మృదువుగా దిశానిర్దేశం చేస్తున్నారు. స్వామీ ముకుందానంద గారు, ఐఐటి మరియు ఐఐఎంలలో చదువుకున్న భారత దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గురువు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారి శిక్షణలో, వేద శాస్త్రాలను అభ్యసించిన స్వామీజీ వారు, ఇప్పుడు, సర్వత్రా జనులకు, వాస్తవికమైన, నిత్యశాశ్వత ఆనందం యొక్క పథాన్ని వివరిస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. తీరిక లేకుండా ఉన్న తమ కార్యక్రమాల నడుమ, వారు గ్రంథాలను, వ్యాఖ్యానాలను వ్రాస్తూ, CD మరియు DVDలను రికార్డు చేస్తూ, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త సమూహాలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. స్వామీజీ వారి ఉపన్యాసాలు వినోదభరితంగా ఉంటాయి, వారు చెప్పే విషయాలు తర్కబద్దంగా, స్పష్టంగా ఉంటాయి, అన్నింటికంటే ముఖ్యంగా, వారి సలహాలు ఆచరణాత్మకంగా ఉంటాయి. వారి ఉపన్యాసాలు చాలా ప్రజాదరణ పొందాయి, మరియు వాటిల్లో, మనస్సుని జయించటం, యోగా ద్వారా మంచి ఆరోగ్యం, ధ్యానము మరియు ఆధ్యాత్మికత మరియు రోజువారీ జీవనంలో కర్మయోగము వంటి అనేకానేక విషయాలు పొందు పరచబడి ఉంటాయి.© 2017,www.logili.com All Rights Reserved.