మనవి
గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్, రాజ్యం కేవలం భౌతిక అవసరాలకు ఉద్భవిస్తుంది కాని, మంచి జీవనానికై కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఈ సూత్రం రాజ్యం మొదలగు వాటికే కాక వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. అరిస్టాటిల్ పేర్కొన్న 'మంచి' అనే దానిని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, భౌతిక ప్రగతి; రెండు, నైతిక ఔన్నత్యం, ఈ రెంటినీ కలిపి పరిగణించినపుడే వ్యక్తిత్వ వికాసం అనే పదబంధం సార్థకమౌతుంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలనే నేను 'వ్యక్తిత్వ వికాసం' పేరుతో పద్యరచన (శతక) రూపంలో పెట్టాను.
ఇక్కడ ఈ పుస్తకానికి గల ప్రేరణ గురించి మీతో ఒక విషయం ముచ్చటించాలి. నాకు జీవితంలో తటస్థపడిన వివిధ సంఘటనలకు ప్రతిస్పందిస్తూ, తరతరాలుగా ప్రభావం చూపిన సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ ఒక్కో పద్యం చొప్పున రాస్తూ, వాటిని భద్రపరచేవాడిని. ఇది నా అలవాటు. తల్లితండ్రుల పెంపకంలో నేర్చుకున్న విషయం . మా అబ్బాయి, డా॥ కొంపల్లి సుందర్ ఒకసారి వీటిని చూశాడు. విషయాలు, విజ్ఞానం, పద్యాలు కేవలం సొంతానికి పరిమితం కాకూడదని, వాటినన్నింటినీ సేకరించి, తానే సంపాదకత్వం నెరపి 'ఇహం పరం' అనే పుస్తకరూపంలో (2019) తీసుకువచ్చాడు. ఈ గ్రంధ ప్రచురణకు శ్రీతమ్మా శ్రీనివాసరెడ్డి, డా॥ సీతాకుమారి, శ్రీమతి కొంపల్లి రాధిక, శ్రీమతి ముదిగొండ మణిమాల సహకారాన్ని అందించారు. ఈ పుస్తకానికి విజ్ఞులు, 'అమ్మనుడి' సంపాదకులైన డా॥ సామల రమేష్ బాబు గారు ముందుమాట రాస్తూ, విడివిడిగా పద్యాలు రాసేకంటే ఏదో ఒక అంశంపై సమగ్రరచన చేయమని వాత్సల్యపూరిత సలహానిచ్చారు. అదే పుస్తకానికి ప్రఖ్యాత న్యాయకోవిదులు, విశ్రాంత భారత సమాచార కమీషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గారు 'శివచైతన్య గంగాధార' పేరుతో ఒక అభినందనపూర్వక వ్యాసం ! రాశారు. వారు మా అబ్బాయికి సలహానిస్తూ, నాచేత ఆధునిక కాలానికి అనుగుణమైన...........
మనవి గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్, రాజ్యం కేవలం భౌతిక అవసరాలకు ఉద్భవిస్తుంది కాని, మంచి జీవనానికై కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఈ సూత్రం రాజ్యం మొదలగు వాటికే కాక వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. అరిస్టాటిల్ పేర్కొన్న 'మంచి' అనే దానిని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, భౌతిక ప్రగతి; రెండు, నైతిక ఔన్నత్యం, ఈ రెంటినీ కలిపి పరిగణించినపుడే వ్యక్తిత్వ వికాసం అనే పదబంధం సార్థకమౌతుంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలనే నేను 'వ్యక్తిత్వ వికాసం' పేరుతో పద్యరచన (శతక) రూపంలో పెట్టాను. ఇక్కడ ఈ పుస్తకానికి గల ప్రేరణ గురించి మీతో ఒక విషయం ముచ్చటించాలి. నాకు జీవితంలో తటస్థపడిన వివిధ సంఘటనలకు ప్రతిస్పందిస్తూ, తరతరాలుగా ప్రభావం చూపిన సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ ఒక్కో పద్యం చొప్పున రాస్తూ, వాటిని భద్రపరచేవాడిని. ఇది నా అలవాటు. తల్లితండ్రుల పెంపకంలో నేర్చుకున్న విషయం . మా అబ్బాయి, డా॥ కొంపల్లి సుందర్ ఒకసారి వీటిని చూశాడు. విషయాలు, విజ్ఞానం, పద్యాలు కేవలం సొంతానికి పరిమితం కాకూడదని, వాటినన్నింటినీ సేకరించి, తానే సంపాదకత్వం నెరపి 'ఇహం పరం' అనే పుస్తకరూపంలో (2019) తీసుకువచ్చాడు. ఈ గ్రంధ ప్రచురణకు శ్రీతమ్మా శ్రీనివాసరెడ్డి, డా॥ సీతాకుమారి, శ్రీమతి కొంపల్లి రాధిక, శ్రీమతి ముదిగొండ మణిమాల సహకారాన్ని అందించారు. ఈ పుస్తకానికి విజ్ఞులు, 'అమ్మనుడి' సంపాదకులైన డా॥ సామల రమేష్ బాబు గారు ముందుమాట రాస్తూ, విడివిడిగా పద్యాలు రాసేకంటే ఏదో ఒక అంశంపై సమగ్రరచన చేయమని వాత్సల్యపూరిత సలహానిచ్చారు. అదే పుస్తకానికి ప్రఖ్యాత న్యాయకోవిదులు, విశ్రాంత భారత సమాచార కమీషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గారు 'శివచైతన్య గంగాధార' పేరుతో ఒక అభినందనపూర్వక వ్యాసం ! రాశారు. వారు మా అబ్బాయికి సలహానిస్తూ, నాచేత ఆధునిక కాలానికి అనుగుణమైన...........© 2017,www.logili.com All Rights Reserved.