కొక్కోకుడు వెయ్యేళ్ళ క్రితం వాడు. గొప్ప సంస్కృత పండితుడు. తృతీయ పురుషార్థమైన 'కామం' గురించి పూర్వశాస్త్ర కర్తలు చెప్పిన దానిని శ్రద్దగా అధ్యయనం చేసిన మహాపండితుడు కొక్కోకుడు. సృష్టి, స్థితి కారకమైన 'కామం' గృహస్థ ధర్మాలలో కెల్లా మిన్న అని భావించాడు కొక్కోకుడు. సంఘిక స్థితి గతులు చూసి తల్లడిల్లాడు కొక్కోకుడు. శరీరపోషణకు ఆహారం ఎంత అవసరమో, కామమూ అంతేనని లోకానికి చాటాలనుకున్నాడు కొక్కోకుడు.
ప్రజలలో కామజ్ఞానం కలిగించాల్సిన అవసరాన్ని గుర్తించాడు కొక్కోకుడు. అప్పటికే సంస్కృతంలో కామశాస్త్ర గ్రంధాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రేవణారాధ్యుడు ' స్మరతత్త్వప్రకాశిక' పేరుతో ఓ గ్రంథం రాశాడు. వేద వేదాంగాలలో నిక్షిప్తమైన 'కామ' భావనకు ఉదాహరణలను ఉటంకిస్తూ ఈ గ్రంధాన్ని ప్రజల కందించాడు రేవణారాధ్యుడు. - శివరామ్