సినీ జర్నలిజంలో ఆరితేరిన నలభైమంది. 'మేము చక్కని కథలు వ్రాయగలము' అని నిరూపించడానికి కూర్చిన సంకలనమే ఈ 'అంతర్ముఖం'. ఎవరూ భాషాచమత్కారం కోసం పోటీ పడలేదు. సహజత్వం కోసం ఆరాటపడ్డారు. కృత్రిమం కోసం పరుగులు తీయలేదు. వాస్తవానికి అతిదగ్గరగా వెళ్ళారు. కొన్ని కథలు స్వర్గీయ మా గురువు గారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి 'గాలివాన' స్థాయి సహజత్వాన్ని దృశ్యీకరించగలిగాయి.
- డా|| దాసరి నారాయణరావు,
వీళ్లకి కథలు రాయడం కూడా వచ్చునా? - అనేది ప్రశ్న. ఫిలిమ్ జర్నలిస్టులు కథలు, రాయగలరు గాని, కథలు రాసే రచయితలందరూ సినిమా జర్నలిజమ్ వేపు రాలేరు. జర్నలిస్టుకి కథ రాయడం వస్తుంది. - రాయకపోయినా, ఎందుకంటే - ఇంటర్వ్యూ ఐనా, వార్తలైనా, సమీక్షలు, విమర్శలు అయినా అన్నీ కథన మార్గంలోనే వుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం కొడవటిగంటి కుటుంబరావు గారు, గోరా శాస్త్రి గారూ ఎవరైనా ఒక తార గురించి రాసినప్పుడు, - కథ రాసినట్టుగానే ఆరంభించేవారు. ఆ నైపుణ్యం సినిమా జర్నలిస్టుకి రాణింపు తీసుకొస్తుంది..
- రావికొండలరావు
జనరల్ గా సినిమావాళ్ళంటే కొంత లోకువే... ఎందరికో చాలా ఎక్కువ అయినా! మేం ఏం చేసినా... దానికి ఊరంత పబ్లిసిటీ... అసలు సినిమా వాళ్ళు అనే కొత్త జాతే సృష్టించబడింది. మేం ఒకళ్ళ జోలికి వెళ్ళం, శొంఠికెళ్ళం... కేవలం వినోదం పంచటానికే వున్నాం... వానలు వరదలు వచ్చినపుడు అవసరమైతే జోలె పట్టీ... గజ్జె కట్టీ... సొమ్ములు వసూల్టేసీ దఖలు పర్చుకుంటాం... అయినా కొంత చిన్నచూపే, అలాగే సినిమాతో ఏ సంబంధ బాంధవ్యాలు వున్నవాళ్ళకి కూడా ఈ కీర్తికిరీటం తప్పదు. మరి సినీ జర్నలిస్టులు కూడా మావాళ్ళే! ఎన్ని కోణాలు... ఎన్ని పార్శ్వాలు... ఎంత వైవిధ్యం... శెభాష్! ఈ కథాసంకలనం... మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది... చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది...!! ముఖ్యంగా సినీ జర్నలిస్టుల మీది గౌరవం ఇనుమడింపజేస్తుంది.
- తనికెళ్ళ భరణి
‘జర్నలిజం ఈజ్ లిటరేచర్ ఇన్ హర్రీ' అన్నారు. కథా సాహిత్యం కంటే ఆసక్తికరంగా పాఠకుల చేత వార్తలు చదివించగల భాష, శైలి, విషయ పరిజ్ఞానం కలిగిన జర్నలిస్టు ఎందరో వున్నారు మన తెలుగు సమాజంలో. జర్నలిస్టపట్ల చాలామందిలో చులకనభావం వుంటుంది. అన్నీ తమకు తెలుసుననుకుంటారనీ, ఏ విషయం పట్లా సమగ్రమైన అవగాహన, పరిజ్ఞానం వుండవని, ఈ సంకలనంలో కథలు చదివితే చాలామంది తమ అభిప్రాయాలు చాలా వాటిని మార్చుకోవాల్సి వుంటుంది.
- దేవులపల్లి అమర్
సినీ జర్నలిజంలో ఆరితేరిన నలభైమంది. 'మేము చక్కని కథలు వ్రాయగలము' అని నిరూపించడానికి కూర్చిన సంకలనమే ఈ 'అంతర్ముఖం'. ఎవరూ భాషాచమత్కారం కోసం పోటీ పడలేదు. సహజత్వం కోసం ఆరాటపడ్డారు. కృత్రిమం కోసం పరుగులు తీయలేదు. వాస్తవానికి అతిదగ్గరగా వెళ్ళారు. కొన్ని కథలు స్వర్గీయ మా గురువు గారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి 'గాలివాన' స్థాయి సహజత్వాన్ని దృశ్యీకరించగలిగాయి. - డా|| దాసరి నారాయణరావు, వీళ్లకి కథలు రాయడం కూడా వచ్చునా? - అనేది ప్రశ్న. ఫిలిమ్ జర్నలిస్టులు కథలు, రాయగలరు గాని, కథలు రాసే రచయితలందరూ సినిమా జర్నలిజమ్ వేపు రాలేరు. జర్నలిస్టుకి కథ రాయడం వస్తుంది. - రాయకపోయినా, ఎందుకంటే - ఇంటర్వ్యూ ఐనా, వార్తలైనా, సమీక్షలు, విమర్శలు అయినా అన్నీ కథన మార్గంలోనే వుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం కొడవటిగంటి కుటుంబరావు గారు, గోరా శాస్త్రి గారూ ఎవరైనా ఒక తార గురించి రాసినప్పుడు, - కథ రాసినట్టుగానే ఆరంభించేవారు. ఆ నైపుణ్యం సినిమా జర్నలిస్టుకి రాణింపు తీసుకొస్తుంది.. - రావికొండలరావు జనరల్ గా సినిమావాళ్ళంటే కొంత లోకువే... ఎందరికో చాలా ఎక్కువ అయినా! మేం ఏం చేసినా... దానికి ఊరంత పబ్లిసిటీ... అసలు సినిమా వాళ్ళు అనే కొత్త జాతే సృష్టించబడింది. మేం ఒకళ్ళ జోలికి వెళ్ళం, శొంఠికెళ్ళం... కేవలం వినోదం పంచటానికే వున్నాం... వానలు వరదలు వచ్చినపుడు అవసరమైతే జోలె పట్టీ... గజ్జె కట్టీ... సొమ్ములు వసూల్టేసీ దఖలు పర్చుకుంటాం... అయినా కొంత చిన్నచూపే, అలాగే సినిమాతో ఏ సంబంధ బాంధవ్యాలు వున్నవాళ్ళకి కూడా ఈ కీర్తికిరీటం తప్పదు. మరి సినీ జర్నలిస్టులు కూడా మావాళ్ళే! ఎన్ని కోణాలు... ఎన్ని పార్శ్వాలు... ఎంత వైవిధ్యం... శెభాష్! ఈ కథాసంకలనం... మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది... చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది...!! ముఖ్యంగా సినీ జర్నలిస్టుల మీది గౌరవం ఇనుమడింపజేస్తుంది. - తనికెళ్ళ భరణి ‘జర్నలిజం ఈజ్ లిటరేచర్ ఇన్ హర్రీ' అన్నారు. కథా సాహిత్యం కంటే ఆసక్తికరంగా పాఠకుల చేత వార్తలు చదివించగల భాష, శైలి, విషయ పరిజ్ఞానం కలిగిన జర్నలిస్టు ఎందరో వున్నారు మన తెలుగు సమాజంలో. జర్నలిస్టపట్ల చాలామందిలో చులకనభావం వుంటుంది. అన్నీ తమకు తెలుసుననుకుంటారనీ, ఏ విషయం పట్లా సమగ్రమైన అవగాహన, పరిజ్ఞానం వుండవని, ఈ సంకలనంలో కథలు చదివితే చాలామంది తమ అభిప్రాయాలు చాలా వాటిని మార్చుకోవాల్సి వుంటుంది. - దేవులపల్లి అమర్© 2017,www.logili.com All Rights Reserved.