ఒక వృద్ధాప్యం, ఒక అనారోగ్యం, ఒక మరణం చూసిన ఆలోచనలు శుద్దోధనుడ్ని బుద్ధుడిగా మార్చాయి.
చెట్టు కింద వుండగా మీద పడ్డ యాపిల్ 'పైకెందుకు పోలేదు, కిందెందుకు పడింది' అన్న న్యూటన్ ఆలోచన 'భూమ్యాకర్షణ' అన్న వైజ్ఞానిక వాస్తవాన్ని మనకు తెలియజేసింది.
అలా అని కాదుగాని ఈ పుస్తకం రావటానికి మూలమైన ఒక ఆలోచన వుంది.
దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద నేను చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం నన్ను ఆలోచనల్లోకి నెట్టింది.
ఇంత భావుకత నిండిన అందమైన వాక్యం ఆ రిక్షా మీద ఎందుకుంది? ఎలా వచ్చింది? ఇది తొలి ఆలోచన.
- వేమూరి సత్యనారాయణ