సీమ భాషలో... అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. 'మిణుగు' కావడమే కాక, సీమ భావితరాలకు ఒక 'పద్మనాభుని నిధి' లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం సీమకే గర్వకారణం.
అందుకే -
'ఆరుగ్లాసుల' బతుకంటే... ఏమిటో!
'ఏకాకి నౌక చప్పుడు'... ఎందుకో!!
'మట్టిగాజుల' సవ్వడి మలారంగా కూరిస్తే... ఏమవుతుందో...!! తెలుసుకోవడానికి...
'ఎం... తెంత దూరమో' అనుకోనక్కర లేదు.
'ఎం... తెంతో దూరం' సాగానక్కర లేదు.
కేవలం మనసుంటే చాలు - ఇంతింతే దూరం... దిబ్బంతే దూరం... పండి మరి పోదాం - పక్క పేజీలోకి...
మంచి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే మంచి సంకల్పంతో పట్టుబట్టి దాన్ని ప్రచురించే దాకా విశ్రమించని వత్సల విద్యాసాగర్ గారికి...
- చిలుకూరి దేవపుత్ర
సీమ భాషలో... అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. 'మిణుగు' కావడమే కాక, సీమ భావితరాలకు ఒక 'పద్మనాభుని నిధి' లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం సీమకే గర్వకారణం. అందుకే - 'ఆరుగ్లాసుల' బతుకంటే... ఏమిటో! 'ఏకాకి నౌక చప్పుడు'... ఎందుకో!! 'మట్టిగాజుల' సవ్వడి మలారంగా కూరిస్తే... ఏమవుతుందో...!! తెలుసుకోవడానికి... 'ఎం... తెంత దూరమో' అనుకోనక్కర లేదు. 'ఎం... తెంతో దూరం' సాగానక్కర లేదు. కేవలం మనసుంటే చాలు - ఇంతింతే దూరం... దిబ్బంతే దూరం... పండి మరి పోదాం - పక్క పేజీలోకి... మంచి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనే మంచి సంకల్పంతో పట్టుబట్టి దాన్ని ప్రచురించే దాకా విశ్రమించని వత్సల విద్యాసాగర్ గారికి... - చిలుకూరి దేవపుత్ర© 2017,www.logili.com All Rights Reserved.