ఇందులో పేర్లు మారొచ్చు, పదాలు మారొచ్చు, భాష మారొచ్చు, ప్రాంతం మారొచ్చు, అనుభవాలు రూపాంతరం చెందొచ్చు కాని... మానవ మనుగడలో... ఏ దశలో అయినా కొంచెం అటు ఇటుగా అవే అనుభవాలు తారసపడతాయి. ఎందుకంటే అది జీవితం. అదే జీవితం. దేవపుత్రగారి కథలు అనుభూతి ప్రధానంగా కంటే అనుభవ ప్రధానంగా సాగుతాయి. అనుభవంలో సంతోషం కంటే ఎక్కువగా గుర్తుండేది, వెంటాడేది కూడా దుఃఖం, బాధలే!! సహజసిద్ధంగా తనచుట్టూ ఉన్న పరిసరాలలో రోజూవారి కార్యక్రమాల్లో నుండి నొప్పిని మాత్రమే గమనించగలగడం, వేగంగా స్వీకరించగలగడం. లోతుగా స్పందించగలగడం అనే లక్షణమే తన అనుభవాలకు కథారూపం దాల్చే విధంగా పొందిన ప్రేరణ ఫలితమే ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం.
సీమ భాషలో... అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. 'మిణుగు' కావడమే కాక, సీమ భావితరాలకు ఒక 'పద్మనాభుని నిధి' లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం సీమకే గర్వకారణం.
- వత్సల విద్యాసాగర్
ఇందులో పేర్లు మారొచ్చు, పదాలు మారొచ్చు, భాష మారొచ్చు, ప్రాంతం మారొచ్చు, అనుభవాలు రూపాంతరం చెందొచ్చు కాని... మానవ మనుగడలో... ఏ దశలో అయినా కొంచెం అటు ఇటుగా అవే అనుభవాలు తారసపడతాయి. ఎందుకంటే అది జీవితం. అదే జీవితం. దేవపుత్రగారి కథలు అనుభూతి ప్రధానంగా కంటే అనుభవ ప్రధానంగా సాగుతాయి. అనుభవంలో సంతోషం కంటే ఎక్కువగా గుర్తుండేది, వెంటాడేది కూడా దుఃఖం, బాధలే!! సహజసిద్ధంగా తనచుట్టూ ఉన్న పరిసరాలలో రోజూవారి కార్యక్రమాల్లో నుండి నొప్పిని మాత్రమే గమనించగలగడం, వేగంగా స్వీకరించగలగడం. లోతుగా స్పందించగలగడం అనే లక్షణమే తన అనుభవాలకు కథారూపం దాల్చే విధంగా పొందిన ప్రేరణ ఫలితమే ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం. సీమ భాషలో... అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. 'మిణుగు' కావడమే కాక, సీమ భావితరాలకు ఒక 'పద్మనాభుని నిధి' లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం సీమకే గర్వకారణం. - వత్సల విద్యాసాగర్© 2017,www.logili.com All Rights Reserved.