ఈ పుస్తకంలోని పన్నెండు కథల్లో చాలా కథలకి పల్లెటూరి నేపథ్యం కనిపిస్తుంది. వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల కథలు ఇవి.
అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, స్మశానంలో తిరిగితేనేకాని పట్టుబడని సూక్ష్మ వివరాలు ఎన్నో అంశాలు ఈ కథల్లో ఉన్నాయి. ఇంటి లోపల కన్నా, ఇంటి బయట జరిగే కథలు ఇవి. ఈ కథల్లో ఏ కథ చదివినా..... ఆమె చాలా సులువుగా కథ చెప్పగలదన్న విషయం అర్థం అవుతుంది. సరళంగా కథ చెప్పడం, క్లిష్టంగా వున్న చోట, ఓ క్షణం ఆగి తేలిక పరిచి తిరిగి ముందుకు సాగించే నైపుణ్యం ఉంది. పల్లె పట్టున బాల్యం దగ్గర నుంచి వృద్దాప్యపు చివరి దశ వరకు అడవుల్లో బతికేవారికి జరుగుతున్న అమానుష అన్యాయం నుంచి ఉప్పు పంటలోని ఆర్థిక అన్యాయ స్థాయి వరకు ఎన్నో వైవిధ్యమున్న వస్తువులు ఈ కథలకి ఆలంబన. రకరకాల జీవన తీరుల్ని, పలుకుబడుల్ని కళ్ళముందు ఉంచుతాయి. ఈ కథలు.
-వి.రాజారామమోహనరావు.
ఈ పుస్తకంలోని పన్నెండు కథల్లో చాలా కథలకి పల్లెటూరి నేపథ్యం కనిపిస్తుంది. వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల కథలు ఇవి. అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, స్మశానంలో తిరిగితేనేకాని పట్టుబడని సూక్ష్మ వివరాలు ఎన్నో అంశాలు ఈ కథల్లో ఉన్నాయి. ఇంటి లోపల కన్నా, ఇంటి బయట జరిగే కథలు ఇవి. ఈ కథల్లో ఏ కథ చదివినా..... ఆమె చాలా సులువుగా కథ చెప్పగలదన్న విషయం అర్థం అవుతుంది. సరళంగా కథ చెప్పడం, క్లిష్టంగా వున్న చోట, ఓ క్షణం ఆగి తేలిక పరిచి తిరిగి ముందుకు సాగించే నైపుణ్యం ఉంది. పల్లె పట్టున బాల్యం దగ్గర నుంచి వృద్దాప్యపు చివరి దశ వరకు అడవుల్లో బతికేవారికి జరుగుతున్న అమానుష అన్యాయం నుంచి ఉప్పు పంటలోని ఆర్థిక అన్యాయ స్థాయి వరకు ఎన్నో వైవిధ్యమున్న వస్తువులు ఈ కథలకి ఆలంబన. రకరకాల జీవన తీరుల్ని, పలుకుబడుల్ని కళ్ళముందు ఉంచుతాయి. ఈ కథలు. -వి.రాజారామమోహనరావు.© 2017,www.logili.com All Rights Reserved.