బహుమతి పొందిన కథానికలతో బాటు మరికొన్ని సాధారణ జాబితాలో ఎంపికైన వాటిని కలిపి ఈ చిరుగ్రంథాన్ని రూపొందించాము. ఇలా తీసుకువస్తే వీటికి శాశ్వత రూపాన్నిచ్చినట్లవుతుందని ఆలోచన. బహుమతి కథానికల్ని విశ్లేషించే ముందు ఈ చిరు గ్రంథాన్ని మనం బలివాడ కాంతారావుగారి స్మృతికి అంకితం చేద్దాం. 'బ్రతకాలి' ని ప్రథమ బహుమతికి ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. ఇది ఎంత ప్రాణాల్ని తీసే జబ్బయినా భయపడకు, జీవించు అని కాన్సర్ రోగులకు ధైర్యాన్నిచ్చిన కథానిక.
రెండవ బహుమతి పొందిన 'ఇది జవాబు' స్త్రీ సమస్యని మరో కోణం నుంచి చూపించడం కాకుండా 'ఇది జవాబు' అనే సమాధాన్ని రచయిత గొప్పగా చెప్పారు. మగవారి దాష్టికాన్ని తట్టుకోవడానికి స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం ఉంటే వాళ్ళ ఆటల్ని కట్టించ వచ్చంటారు రచయిత.
'బొడ్డుతాడు' మూడవ బహుమతి పొందిన కథానిక. డబ్బుకన్నా పేగు బంధం గొప్పదనే విషయాన్ని ఈ కథానిక ద్వారా చెప్పారు రచయిత. కన్సొలేషన్ బహుమతులు. పోటీకి వచ్చిన కథానికల్ని చదివితే వైవిథ్యం మీకే అర్థమవుతుంది. బలివాడ కాంతారావుగారిని స్మరిస్తూ వచ్చిన కథల సంకలనం మీ అందరికీ ఆనందాన్నిస్తుందని ఆశిస్తున్నాం.
- వేదగిరి రాంబాబు
బహుమతి పొందిన కథానికలతో బాటు మరికొన్ని సాధారణ జాబితాలో ఎంపికైన వాటిని కలిపి ఈ చిరుగ్రంథాన్ని రూపొందించాము. ఇలా తీసుకువస్తే వీటికి శాశ్వత రూపాన్నిచ్చినట్లవుతుందని ఆలోచన. బహుమతి కథానికల్ని విశ్లేషించే ముందు ఈ చిరు గ్రంథాన్ని మనం బలివాడ కాంతారావుగారి స్మృతికి అంకితం చేద్దాం. 'బ్రతకాలి' ని ప్రథమ బహుమతికి ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. ఇది ఎంత ప్రాణాల్ని తీసే జబ్బయినా భయపడకు, జీవించు అని కాన్సర్ రోగులకు ధైర్యాన్నిచ్చిన కథానిక. రెండవ బహుమతి పొందిన 'ఇది జవాబు' స్త్రీ సమస్యని మరో కోణం నుంచి చూపించడం కాకుండా 'ఇది జవాబు' అనే సమాధాన్ని రచయిత గొప్పగా చెప్పారు. మగవారి దాష్టికాన్ని తట్టుకోవడానికి స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం ఉంటే వాళ్ళ ఆటల్ని కట్టించ వచ్చంటారు రచయిత. 'బొడ్డుతాడు' మూడవ బహుమతి పొందిన కథానిక. డబ్బుకన్నా పేగు బంధం గొప్పదనే విషయాన్ని ఈ కథానిక ద్వారా చెప్పారు రచయిత. కన్సొలేషన్ బహుమతులు. పోటీకి వచ్చిన కథానికల్ని చదివితే వైవిథ్యం మీకే అర్థమవుతుంది. బలివాడ కాంతారావుగారిని స్మరిస్తూ వచ్చిన కథల సంకలనం మీ అందరికీ ఆనందాన్నిస్తుందని ఆశిస్తున్నాం. - వేదగిరి రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.