దేవరాజు రవి, దేవరాజు సీత
తెలుగులో తొలి అపరాధ పరిశోధక నవల "వాడే వీడు" (1912) రచయిత దేవరాజు వేంకట కృష్ణారావు పంతులుగారి కుమారులు - దేవరాజు రవి. వీరి తొలినవల "రామం" (1959), సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు మొదలైన ప్రముఖులు లేఖాపూర్వకంగా మెచ్చుకున్నారు. తర్వాత 12 నవలలు, 3 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, 200 పైగా కథలు, వివిధ విషయాలపై వీరు రాసిన వ్యాసాలకు లెక్కలేదు. వీరు దైవమ్ మాసపత్రికలో 60కిపైగా ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురించారు.
వీరు 1247 తెలుగు సినిమాలకు సమీక్షలు రాశారు. అవి సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్‌వన్ మొదలగు ప్రముఖ సినీ వారపత్రికలలో ప్రచురణ అయ్యాయి. దూరదర్శన ఆకాశవాణి కేంద్రాల నుంచి చాలా రచనలు ప్రసారమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వనందీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా రెండుసార్లు పనిచేశారు.
వీరి శ్రీమతి దేవరాజు సీత కూడా రచయిత్రే ఒక నవల, దాదాపు 60 కథలు, ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. కొన్ని కథలను ఎస్.ఆర్.కమ్యునికేషన్స వారు (మారేమండ సీతారామయ్య) ఆడియోసి.డి.లుగా విడుదల చేశారు.
వీరికి సాహిత్యంతో పాటు, కుష్ఠురోగుల సేవ అన్నా చాలా ఇష్టం. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వీరుకుపురోగుల సేవలను హెచ్.ఐ.వి.రోగుల సేవలను నేటికీ అందిస్తున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీనివాసరావు. బాలకృష్ణ - కోడళ్ళు - పద్మావతి మాధవి. మనుమలు-సత్యసాయికృష్ణ, సాయిప్రసాద్. మనుమరాలు-అలేఖ్య,
© 2017,www.logili.com All Rights Reserved.