సంస్కృత, ప్రకృతాంధ్రాలలో చక్కని పండితుడైన గోపరాజు రచనకు
సంస్కృత, తెలుగు పండితులు శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి నేటి తెలుగులో
ఇచ్చిన రూపమే ఈ భోజ - సాలభంజికల కథలు.
- కొంపెల్ల రామకృష్ణమూర్తి
భారతీయ కథా సాహిత్యానికి మూలమైన 'బృహత్కథ' నుంచి
వెలుగుధారగా ప్రవహించిన 'కథాసరిత్సాగరమ్' తరగని కథల గని.
గడచిన వెయ్యేళ్లకు పైగా కాలంలో ఎన్నో ఎనెన్నో కథల రాశులను
సంస్కృత మహాకవులు ఆ గని నుంచి వెలికితీసి భారతావనికి అందించారు.
సంస్కృత కథాసాహిత్యం ఆధారంగా తెలుగులో తొలుత కథాకావ్యాలు,
ఆ తర్వాత కథాసంపుటాలను మన కవులు సృజించారు.
కేతన, మంచన, జక్కన వ్రాసిన కథాకావ్యాల పరంపరలో వచ్చిన
అనంతుని 'భోజరాజీయం' , కొరవి గోపరాజు 'సింహాసన ద్వాత్రింశిక' -
ఆబాలగోపాలాన్ని మురిపించిన కథాగుచ్ఛలు.
సంస్కృత, ప్రకృతాంధ్రాలలో చక్కని పండితుడైన గోపరాజు రచనకు
సంస్కృత, తెలుగు పండితులు శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి నేటి తెలుగులో
ఇచ్చిన రూపమే ఈ భోజ - సాలభంజికల కథలు.
- కొంపెల్ల రామకృష్ణమూర్తి