సోషల్ వర్క్ లో పి. జి. చేసి కొన్ని ఎన్.జి.ఒ.ల్లో, కార్పొరేట్లలో పనిచేసాను. కథలు, కవితలు , కొన్ని ఇంటర్వ్యూలు, పుస్తక పరిచయాలు, కాలమ్స్ తో పాటు చిన్న వయసులోనే ఎవరెస్టు అధిరోహించిన పూర్ణ మాలావత్ ప్రస్ధానాన్ని నవలగా ఇంగ్లిష్ లో రాసాను.
గీత దాటకుండా జీవితాన్ని చక్కదిద్దుకొమ్మని సూచిస్తారు విజ్ఞలు. అసలు గీత గీసేందేవరో, దేనికోసమో తెలియకుండా బరిలోకి దిగడమెందుకో అని విసుక్కుంటుంది నాలో రచయిత. ఒకవేళ గీతలోనే ఆడాలి అంటే మన గీత మనమే గీసుకోవాలి. దాని కోసం బరిదాటాలీ .
ఆ దిశగా చేసిన ప్రయత్నమే ఈ కథలు, చదివి పరివిధాలుగా స్పందించిన పాఠకులకు, పుస్తక రూపాన్నిచ్చిన "అన్వీక్షికి" కి ఈ ప్రయాణానికి బలాన్నిచ్చి, మార్గం చూపి, తోడు నిలిచినవారందరికి మరింత ప్రేమ.