పుణ్యప్రభాదేవి(1938): విశాఖపట్నంలో స్థిరపడ్డ ఒడియా రచయిత్రి. స్నేహశీలి. తెలుగు సాహితీవేత్తలకు మిత్రురాలు. కథకురాలు, నవలారచయిత్రి, గేయ కవయిత్రి. బాలసాహిత్య సృజనలో ప్రవీణురాలు. ఈమె 11 బాలసాహిత్య సంకలనాలు, 7 నవలలు 8 కథా సంకలనాలు వెలువరించారు. 2010 లో కేంద్ర సాహిత్య అకాడెమి, దిల్లీ వారు బాలసాహిత్య పురస్కారం తన 'కుని గోఇందా, (బుజ్జి పత్తేదారు) చిన్న పిల్లల కథల సంకలనానికి యిచ్చారు. 1960 లో ఎన్.సి.ఇ.ఆర్.టి. నుండి “కాలియా బలదొగొల్లా గొల్లా” సంకలనానికి జాతీయ సరసారం అందుకున్నారు. 1965 లో గేయకవితలకు ఆకాశవాణి పురస్కారం, తెలుగులో అనువదించబడిన కథకు 'రచన' పురస్కారం తోపాటు ఒడిశాలో అనేక సంస్థలనుండి సన్మానాలు పొందారు. రమాకాంతొరొడొ, తరుణకాంతి మిశ్రవంటి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఈమె పేరు Who is who of childrens Literature, Reference Asia, పుస్తకాల్లో స్థానం పొందింది. -
చాగంటి తులసి: ఒడిశాలో (ఒడిశా ప్రభుత్వ విద్యాసేవ) హిందీ విభాగ అధిపతిగా, రీడరుగా, హాంకుక్ యూనివర్సిటీ ఫర్ ఫారిన్ లాంగ్వేజ్ స్టడీస్ సియోలు (దక్షిణ కొరియా) లో హిందీ విభాగపు గెస్టు ప్రొఫెసరుగా పని చేశారు. హిందీ, ఒడియా, తెలుగు, ఇంగ్లీషు భాషల ప్రామాణిక అనువాద రచయిత్రిగా ప్రసిద్ధి పొందారు. ఆమె హిందీ నుండి చేసిన తెలుగు అనువాదాలు " ఓల్గా నుంచి గంగకు” (రాహుల్ సాంకృత్యాయన్ రచన) “మహాదేవివర్మ గీతాలు” (మహాకవయిత్రి మహాదేవివర్మ హిందీగీతాలు) విశిష్టమైనవి. మాతృభాష తెలుగులో పేరున్న కథారచయిత్రి. 1991లో ఉత్తమ కథారచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. మౌలిక రచనలు అనువాద రచనలు కలిపి ఆమె 30 పుస్తకాలు వెలువరించారు.
పుణ్యప్రభాదేవి(1938): విశాఖపట్నంలో స్థిరపడ్డ ఒడియా రచయిత్రి. స్నేహశీలి. తెలుగు సాహితీవేత్తలకు మిత్రురాలు. కథకురాలు, నవలారచయిత్రి, గేయ కవయిత్రి. బాలసాహిత్య సృజనలో ప్రవీణురాలు. ఈమె 11 బాలసాహిత్య సంకలనాలు, 7 నవలలు 8 కథా సంకలనాలు వెలువరించారు. 2010 లో కేంద్ర సాహిత్య అకాడెమి, దిల్లీ వారు బాలసాహిత్య పురస్కారం తన 'కుని గోఇందా, (బుజ్జి పత్తేదారు) చిన్న పిల్లల కథల సంకలనానికి యిచ్చారు. 1960 లో ఎన్.సి.ఇ.ఆర్.టి. నుండి “కాలియా బలదొగొల్లా గొల్లా” సంకలనానికి జాతీయ సరసారం అందుకున్నారు. 1965 లో గేయకవితలకు ఆకాశవాణి పురస్కారం, తెలుగులో అనువదించబడిన కథకు 'రచన' పురస్కారం తోపాటు ఒడిశాలో అనేక సంస్థలనుండి సన్మానాలు పొందారు. రమాకాంతొరొడొ, తరుణకాంతి మిశ్రవంటి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఈమె పేరు Who is who of childrens Literature, Reference Asia, పుస్తకాల్లో స్థానం పొందింది. - చాగంటి తులసి: ఒడిశాలో (ఒడిశా ప్రభుత్వ విద్యాసేవ) హిందీ విభాగ అధిపతిగా, రీడరుగా, హాంకుక్ యూనివర్సిటీ ఫర్ ఫారిన్ లాంగ్వేజ్ స్టడీస్ సియోలు (దక్షిణ కొరియా) లో హిందీ విభాగపు గెస్టు ప్రొఫెసరుగా పని చేశారు. హిందీ, ఒడియా, తెలుగు, ఇంగ్లీషు భాషల ప్రామాణిక అనువాద రచయిత్రిగా ప్రసిద్ధి పొందారు. ఆమె హిందీ నుండి చేసిన తెలుగు అనువాదాలు " ఓల్గా నుంచి గంగకు” (రాహుల్ సాంకృత్యాయన్ రచన) “మహాదేవివర్మ గీతాలు” (మహాకవయిత్రి మహాదేవివర్మ హిందీగీతాలు) విశిష్టమైనవి. మాతృభాష తెలుగులో పేరున్న కథారచయిత్రి. 1991లో ఉత్తమ కథారచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. మౌలిక రచనలు అనువాద రచనలు కలిపి ఆమె 30 పుస్తకాలు వెలువరించారు.© 2017,www.logili.com All Rights Reserved.