రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి పౌష్టికాహారం కావాలి. మానసిక వికాసానికి చదువు కావాలి. అయితే పిల్లలకి పౌష్టికాహారం కంటే ఫలహారాలు, చిరు తిళ్లు ఎక్కువిష్టం. అందుకని వాళ్ల ఆరోగ్యానికి భంగం కలగకుండా, ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్లను రూపొందించాలి. అలాగే పిల్లలకి చదువుకంటే ఆటాపాటలూ, కథలూ, ఎక్కువిష్టం. అందుకని అవి జ్ఞాన , విజ్ఞాన, వికాసాలను అడ్డుపడకుండా , మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని , వినోదాన్ని కలిగిస్తూ అర్ధవంతమై ఉండాలి . కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక "చందమామ" అన్నది నిర్వివాదాంశం. ఆ కథలు సంప్రదాయపు గొప్పతనం చెబుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.