చందమామ కేవలం పిల్లల పత్రిక అనుకొంటె తప్పే అవుతుంది. చిన్నవాళ్ళ దగ్గర నుండి వృద్ధుల దాక అందరూ ఇష్టపడే పత్రిక చందమామ.
ఎందుకిలా ఏముంది ఇందులో ?
చందమామది విభిన్నశైలి విచిత్రమైన పాత్రలు, మనస్సును ఆకట్టుకొనే చిన్న చిన్న కథలు రంగు రంగుల బొమ్మలు భారత ఇతిహాసాలను తెలిపే రామాయణ, మహాభారత కావ్యాలు ఇంకా జానపద కథా సీరియల్లు అదో అద్భుత ప్రపంచం. చందమామలో 'మాయక-అమాయక' రెండు రకాల పాత్రలు చదువరులను ఆకట్టుకొంటాయి.
చందమామ సృష్టికర్తలు నాగిరెడ్డి చక్రపాణిలు కథల్లో ఎక్కడా సాంగికం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అంతేకాదు వ్యాపార ప్రకటనలకు కూడా అంతగా ప్రాధాన్యతలివ్వలేదు. చందమామను ఒక అపురూప శిల్పంగా తీర్చిదిద్దారు. చందమామది 66 సం||రాల సుదీర్ఘచరిత్ర. 100 ప్రతుల నుండి వేలు లక్షలు దాటింది. అంతేకాదు 3 భాషల్లో మొదలై 14 భాషలకు చేరి ఎల్లలు దాటింది. అన్ని భాషల వారిని అలరించింది. నాగిరెడ్డి చక్రపాణి గార్లు సినిమా రంగం వైపు వెళ్ళినా చందమామను అశ్రద్ధ చేయలేదు దాని నిర్వహణ బాధ్యతలు కొడవటిగంటి కుటుంబరావు గారికి అప్పగించారు. కొడవటిగంటి వారి సారథ్యంలో చందమామ సౌందర్యం చెక్కుచెదరలేదు. కుటుంబరావు గారు రచయితలకు కథలు దిద్ద పెట్టారు. అక్షరాభ్యాసం చేసిన మహానుభావుడు.
చందమామ కాంతులీనడానికి వెనుక మరో ముగ్గురి ప్రతిభ ఉంది. వారే శంకర్, చిత్ర, వడ్డాది పాపయ్య వీరు ముగ్గురు వేసిన చిత్రాలు అనితర సాధ్యం. ఆ బొమ్మలే చందమామ ఆకర్షణ.
ఈనాడు పిల్లలు పెద్దలు క్షణం తీరిక లేకుండా జీవితం గడుపుతున్నారు. ఇంకా కొందరైతే ఇంటర్‌నెట్ల ముందు కూర్చుని చూడకూడనివి చూస్తున్నారు. చదవకూడనివి చదువుతున్నారు. ఫలితంగా నేర ప్రవృత్తిని అలవర్చుకొని నేరస్తులుగా మారుతున్నారు. వారిని రక్షించుకోవాలంటే పుస్తకపఠనం ఒక్కటే మార్గం. పుస్తకాలు చదవడం వల్ల భాషా పరిజ్ఞానమే కాదు మనోవికాసం చెందుతారు. అన్నా, చెల్లి, అమ్మా, నాన్న సంబంధ బాంధవ్యాలు, ప్రేమానురాగాలు తెలుసుకుంటారు.
ఇది ఇంటర్నెట్ యుగం. మనిషి జీవితం దీనితోనే ముడిపడి ఉంది. ఆధునిక యుగంలో దాని అవసరం తప్పనిసరి కాని! అదే జీవితంగా అదే ఊపిరిగా కాకూడదు! మనిషి ఉనికిని కోల్పోకూడదు అందుకే పెద్దలు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయించి ఈ సమాజానికి మంచి పౌరులను అందిద్దాం.
బూర్లె నాగేశ్వరరావు