ఈ పుస్తకంలోని కథలన్నీ మధ్య తరగతి కుటుంబాలలో మామూలుగా జరిగే సంఘటనలనే చక్కటి కథాంశాలుగా మలిచి చిక్కటి కథాశైలితో అలరారే కథలుగా అందించారు. పదాడంబరతకు పోకుండా రోజూవారీ మాట్లాడుకునే భాషలోనే ఇందులోని కథలన్నీ సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఏ కథను చదవడం ప్రారంభించినా ఏకబిగిన చదివిస్తుంది. రీడబిలిటీ అంటే ఇదేనేమో! చెప్పదలచుకున్న విషయాన్ని డొంకతిరుగుళ్ళు లేకుండా సూటిగా మనస్సుకు హత్తుకునేలా చెబుతూ పరిష్కార మార్గాన్ని కూడా రేఖా మాత్రంగా సూచిస్తూ కొసమెరుపులతో కథ ముగుస్తుంది.
ఈ కథలలో 'రైడింగ్' పూర్తిగా నా కోరికలోంచే పుట్టి అలాగే కలలు కని రాసిన కథ. 'స్వీకార్ ఉపకార్' లో ఒకసారి ఒక ఆర్టికల్ కోసం వెళ్లాను. అక్కడ విద్యావంతురాలైన ఒక అందమయిన అమ్మాయికి మానసిక వైకల్యంతో ఉన్న కూతురిని చూసి రాసిన కథ 'తల్లికి పిల్ల భారమే'. మా బంధువులలో ఒకరికి ఏర్పడిన శిరోజాల సమస్యను ఫ్యాషన్ కి ముడిపెట్టి సరదాగా అల్లిన కథ 'తీరిన కోరిక'. 'బొమ్మ బొరుసు' అయితే మా నాన్నగారు చెప్పిన ఒకరి అనుభవానికి హంగులు అద్దిన కథ. వంట వచ్చిన మొగుడితో ఆడవాళ్ళ ఇబ్బందులకి అద్దం పట్టే 'నలభీమసామ్రాట్' ఆంధ్రభూమి ప్రత్యేక సంచిక కోసం అడగితే రాసిన హాస్యకథ. ఇలా అన్ని కథలు ఎవరో ఒకరి జీవితాలనుండి తీసుకున్నవే, మనసు స్పందించినపుడు రాసినవే.
- కామేశ్వరి చెంగల్వల
ఈ పుస్తకంలోని కథలన్నీ మధ్య తరగతి కుటుంబాలలో మామూలుగా జరిగే సంఘటనలనే చక్కటి కథాంశాలుగా మలిచి చిక్కటి కథాశైలితో అలరారే కథలుగా అందించారు. పదాడంబరతకు పోకుండా రోజూవారీ మాట్లాడుకునే భాషలోనే ఇందులోని కథలన్నీ సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఏ కథను చదవడం ప్రారంభించినా ఏకబిగిన చదివిస్తుంది. రీడబిలిటీ అంటే ఇదేనేమో! చెప్పదలచుకున్న విషయాన్ని డొంకతిరుగుళ్ళు లేకుండా సూటిగా మనస్సుకు హత్తుకునేలా చెబుతూ పరిష్కార మార్గాన్ని కూడా రేఖా మాత్రంగా సూచిస్తూ కొసమెరుపులతో కథ ముగుస్తుంది. ఈ కథలలో 'రైడింగ్' పూర్తిగా నా కోరికలోంచే పుట్టి అలాగే కలలు కని రాసిన కథ. 'స్వీకార్ ఉపకార్' లో ఒకసారి ఒక ఆర్టికల్ కోసం వెళ్లాను. అక్కడ విద్యావంతురాలైన ఒక అందమయిన అమ్మాయికి మానసిక వైకల్యంతో ఉన్న కూతురిని చూసి రాసిన కథ 'తల్లికి పిల్ల భారమే'. మా బంధువులలో ఒకరికి ఏర్పడిన శిరోజాల సమస్యను ఫ్యాషన్ కి ముడిపెట్టి సరదాగా అల్లిన కథ 'తీరిన కోరిక'. 'బొమ్మ బొరుసు' అయితే మా నాన్నగారు చెప్పిన ఒకరి అనుభవానికి హంగులు అద్దిన కథ. వంట వచ్చిన మొగుడితో ఆడవాళ్ళ ఇబ్బందులకి అద్దం పట్టే 'నలభీమసామ్రాట్' ఆంధ్రభూమి ప్రత్యేక సంచిక కోసం అడగితే రాసిన హాస్యకథ. ఇలా అన్ని కథలు ఎవరో ఒకరి జీవితాలనుండి తీసుకున్నవే, మనసు స్పందించినపుడు రాసినవే. - కామేశ్వరి చెంగల్వల© 2017,www.logili.com All Rights Reserved.