కష్టజీవులు
అది చోడరాజ్యం, చోడరాజ్యం రాణిగారు రథంలో కూర్చొని ఊరు చివర ఉన్న ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఆనందించి అక్కడ ఆగింది కాసేపు. సూర్యాస్తమయం, చల్లగాలి ఆమెను ఎంతో ఉల్లాస పరిచాయి.
ఊరి చివర ఉన్న పేదవారు వచ్చి రాణిగారికి అందమైన పూల గుత్తులు, పండ్లు, కూరగాయలు ఇచ్చి రథంలో పెట్టారు. రాణిగారు అవన్నీ సంతోషంగా స్వీకరించింది. ప్రజలు తనపట్ల చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి రాణిగారు పొంగిపోయారు.
మెల్లగా చీకటి పడింది. ఉన్నట్లుండి మేఘాలు వచ్చాయి. సన్నగా జల్లు మొదలైంది. రాణిరథంలో కూర్చుంది. రథసారధి గుణాలను అదిలించాడు, వర్షం క్రమక్రమంగా ఎక్కువైంది. రథసారధికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
రథసారధి దగ్గర్లో ఉన్న ఇల్లు కోసం చూసాడు. ఒక్క పెంకుటిల్లు తప్ప చుట్టుప్రక్కల ఏమి ఇళ్లు లేవు. తప్పని సరియై రథాన్ని ఆ పెంకుటిల్లు ముందు ఆపాడు. శబ్దం విని ఆ ఇంటావిడ తలుపుతెరిచి చూసింది. ఎదురుగా రాణిగారిని చూసి ఆమె ఎంతో వినయంతో రాణిగారిని ఇంట్లోకి జ: ఆహ్వానించింది కుర్చివేసింది, రాణిగారు కూర్చున్నారు. రాణిగారు ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. ఎంతో చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి. ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు కూర్చొని జొన్న అన్నం పచ్చడితో కలుపుకొని తింటున్నారు.
ఆ అమ్మాయిలు నిండుగా, పుష్టిగా ఆనందంగా కన్పించారు. అంత పేద తిండితింటూ వారు అంత అందంగా, పుష్టిగా, ఆనందంగా ఎలా * ఉన్నారు అని ఆశ్చర్యపోయింది. ఆ సంగతి, ఆ పిల్లల పేర్లు, వారి ఆరోగ్య - రహస్యాన్ని తల్లిని అడిగింది....................
కష్టజీవులు అది చోడరాజ్యం, చోడరాజ్యం రాణిగారు రథంలో కూర్చొని ఊరు చివర ఉన్న ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఆనందించి అక్కడ ఆగింది కాసేపు. సూర్యాస్తమయం, చల్లగాలి ఆమెను ఎంతో ఉల్లాస పరిచాయి. ఊరి చివర ఉన్న పేదవారు వచ్చి రాణిగారికి అందమైన పూల గుత్తులు, పండ్లు, కూరగాయలు ఇచ్చి రథంలో పెట్టారు. రాణిగారు అవన్నీ సంతోషంగా స్వీకరించింది. ప్రజలు తనపట్ల చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి రాణిగారు పొంగిపోయారు. మెల్లగా చీకటి పడింది. ఉన్నట్లుండి మేఘాలు వచ్చాయి. సన్నగా జల్లు మొదలైంది. రాణిరథంలో కూర్చుంది. రథసారధి గుణాలను అదిలించాడు, వర్షం క్రమక్రమంగా ఎక్కువైంది. రథసారధికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రథసారధి దగ్గర్లో ఉన్న ఇల్లు కోసం చూసాడు. ఒక్క పెంకుటిల్లు తప్ప చుట్టుప్రక్కల ఏమి ఇళ్లు లేవు. తప్పని సరియై రథాన్ని ఆ పెంకుటిల్లు ముందు ఆపాడు. శబ్దం విని ఆ ఇంటావిడ తలుపుతెరిచి చూసింది. ఎదురుగా రాణిగారిని చూసి ఆమె ఎంతో వినయంతో రాణిగారిని ఇంట్లోకి జ: ఆహ్వానించింది కుర్చివేసింది, రాణిగారు కూర్చున్నారు. రాణిగారు ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. ఎంతో చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి. ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు కూర్చొని జొన్న అన్నం పచ్చడితో కలుపుకొని తింటున్నారు. ఆ అమ్మాయిలు నిండుగా, పుష్టిగా ఆనందంగా కన్పించారు. అంత పేద తిండితింటూ వారు అంత అందంగా, పుష్టిగా, ఆనందంగా ఎలా * ఉన్నారు అని ఆశ్చర్యపోయింది. ఆ సంగతి, ఆ పిల్లల పేర్లు, వారి ఆరోగ్య - రహస్యాన్ని తల్లిని అడిగింది....................© 2017,www.logili.com All Rights Reserved.