తెలుగు కథ చచ్చినాచావదని బేతాళుడు నిరూపించాడు. శవంగా కథకి జీవం పోసి దాన్ని విక్రమార్కుడి భుజం మీద సవారీ చేయించాడు. మీరింకా కథలు విరివిగా రాయడం మానెయ్యడం మానేయ్యలేదా అంటూ కౌముది ఆకాశ పుటిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ గారు, వారి సతీమణి శ్రీమతి కాంతి గారు ప్రోత్సహ కమ్చీ ఝుళిపించి వరైటీగా సినీవాతావరణం జోడించి, నా చేత ఈ సినీబేతాళ కథలు వ్రాయిస్తూ నాకిదో అలవాటు చేసేసారు. వారికి నా ఋణం దారుణం.
- డా కె వివేకానందమూర్తి
వెటకారానికీ హాస్యానికి, వ్యంగ్యానికి స్పష్టమైన తేడాలు తెలియాలంటే, వివేకానందమూర్తి గారి రచనలు పరిశోధిస్తే చాలు. మూడూ నవ్వించేవే, చురుక్కు మనిపించేవే. కానీ, ప్రయోగించడంలోని నేర్పే నవ్వించడానికి ప్రధాన కారణమౌతుంది. సునిశితమైన హాస్యరసాన్ని సులలితమైన భాషలో అందించడం డాక్టర్ ప్రత్యేకతా, విలక్షణత కూడ. ఈ మాట ఎందుకంటున్నానంటే వారిని మరెవరితో పోల్చలేము. మిగతా ప్రక్రియలు వేరు, హాస్యరచన వేరు. కథల్ని వాటి ఉదాత్తతని, లోపాల్ని నిర్మాణ కౌశలాన్ని ఎంతైనా సమీక్షించవచ్చు. హాస్య కథల్ని సమీక్షించలేము , చదివి ఆనందించాల్సిందే. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇవి వివేకంతో కూడిన హాస్య రచనలు. కడుపుబ్బ నవ్వించడమే కాదు. ఆలోచననీ కలిగిస్తాయి. ప్రతి కథ నవ్విస్తూ తనదైన ముద్రని మన మనసులో వేస్తుంది.
- భువన చంద్ర
తెలుగు కథ చచ్చినాచావదని బేతాళుడు నిరూపించాడు. శవంగా కథకి జీవం పోసి దాన్ని విక్రమార్కుడి భుజం మీద సవారీ చేయించాడు. మీరింకా కథలు విరివిగా రాయడం మానెయ్యడం మానేయ్యలేదా అంటూ కౌముది ఆకాశ పుటిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ గారు, వారి సతీమణి శ్రీమతి కాంతి గారు ప్రోత్సహ కమ్చీ ఝుళిపించి వరైటీగా సినీవాతావరణం జోడించి, నా చేత ఈ సినీబేతాళ కథలు వ్రాయిస్తూ నాకిదో అలవాటు చేసేసారు. వారికి నా ఋణం దారుణం. - డా కె వివేకానందమూర్తి వెటకారానికీ హాస్యానికి, వ్యంగ్యానికి స్పష్టమైన తేడాలు తెలియాలంటే, వివేకానందమూర్తి గారి రచనలు పరిశోధిస్తే చాలు. మూడూ నవ్వించేవే, చురుక్కు మనిపించేవే. కానీ, ప్రయోగించడంలోని నేర్పే నవ్వించడానికి ప్రధాన కారణమౌతుంది. సునిశితమైన హాస్యరసాన్ని సులలితమైన భాషలో అందించడం డాక్టర్ ప్రత్యేకతా, విలక్షణత కూడ. ఈ మాట ఎందుకంటున్నానంటే వారిని మరెవరితో పోల్చలేము. మిగతా ప్రక్రియలు వేరు, హాస్యరచన వేరు. కథల్ని వాటి ఉదాత్తతని, లోపాల్ని నిర్మాణ కౌశలాన్ని ఎంతైనా సమీక్షించవచ్చు. హాస్య కథల్ని సమీక్షించలేము , చదివి ఆనందించాల్సిందే. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇవి వివేకంతో కూడిన హాస్య రచనలు. కడుపుబ్బ నవ్వించడమే కాదు. ఆలోచననీ కలిగిస్తాయి. ప్రతి కథ నవ్విస్తూ తనదైన ముద్రని మన మనసులో వేస్తుంది. - భువన చంద్ర© 2017,www.logili.com All Rights Reserved.