ఈ సకలచరాచర సృష్టిలో కళాసౌందర్యం శాశ్వతమైనది. మానవ జీవితం శాశ్వతం. అటు వంటి కళాకారులు కొందరు సృష్టించిన అద్భుత శిల్పసౌందర్యాన్ని వాటి వెనుక దాగిన గాథలను గురించినవే ఈ కాలం మరువని కథలు. విశజబిరుదాంకితులైన మా బావగారు శోభిరాల సత్యనారాయణ గారు రచించిన రాగమయి, కోణార్క, త్యాగమయి అనే పద్యకావ్యాలు ఆధారంగా ఈ కథలు రచించాను.
కళాప్రపూర్ణ కొండూరు వీరరాఘవాచార్యులు నా తండ్రి గారు, ఆయన ఆమర కావ్యం అమరమైన శిల్పశోభితమైనది ఆ గాథ ఆధారంగా అమరావతి కథ. శ్రీ ఎట్రోజు మాధవాచార్యుల వారి “ప్రతిమా శంబూకం, ఆధారంగా శంబూకుడు అనే కథ వ్రాశాను. ఇవన్నీ మానవ మనస్తత్వాన్ని, శిల్పకళా సౌందర్యాన్ని ప్రదర్శించేవే! పాఠకులు ఈ కథలను ఆదరించి మన్నిస్తారని ఆశిస్తున్నాను.
రాగమయి పద్యకావ్యం మా అక్కగారు బాలా త్రిపురసుందరి కోరిక మీద మరలా ముద్రించడమైనది. కావ్యాన్ని చక్కగా డి.టి.పి. చేసి యిచ్చిన శ్రీ కొల్లోజు కనకాచారి గారు, నల్గొండ వారు నాన్నగారి కావ్యాలమీద పరిశోధన చేసిన సహృదయులు. చక్కని అభిప్రాయాలు వ్రాసిన డా. గౌరీశంకర్ (హైదరాబాద్), డా. పి.బి.డి.వి. ప్రసాద్, డా. గెలివి సహదేవుడు వారికి ధన్యవాదములు...
ఈ సకలచరాచర సృష్టిలో కళాసౌందర్యం శాశ్వతమైనది. మానవ జీవితం శాశ్వతం. అటు వంటి కళాకారులు కొందరు సృష్టించిన అద్భుత శిల్పసౌందర్యాన్ని వాటి వెనుక దాగిన గాథలను గురించినవే ఈ కాలం మరువని కథలు. విశజబిరుదాంకితులైన మా బావగారు శోభిరాల సత్యనారాయణ గారు రచించిన రాగమయి, కోణార్క, త్యాగమయి అనే పద్యకావ్యాలు ఆధారంగా ఈ కథలు రచించాను. కళాప్రపూర్ణ కొండూరు వీరరాఘవాచార్యులు నా తండ్రి గారు, ఆయన ఆమర కావ్యం అమరమైన శిల్పశోభితమైనది ఆ గాథ ఆధారంగా అమరావతి కథ. శ్రీ ఎట్రోజు మాధవాచార్యుల వారి “ప్రతిమా శంబూకం, ఆధారంగా శంబూకుడు అనే కథ వ్రాశాను. ఇవన్నీ మానవ మనస్తత్వాన్ని, శిల్పకళా సౌందర్యాన్ని ప్రదర్శించేవే! పాఠకులు ఈ కథలను ఆదరించి మన్నిస్తారని ఆశిస్తున్నాను. రాగమయి పద్యకావ్యం మా అక్కగారు బాలా త్రిపురసుందరి కోరిక మీద మరలా ముద్రించడమైనది. కావ్యాన్ని చక్కగా డి.టి.పి. చేసి యిచ్చిన శ్రీ కొల్లోజు కనకాచారి గారు, నల్గొండ వారు నాన్నగారి కావ్యాలమీద పరిశోధన చేసిన సహృదయులు. చక్కని అభిప్రాయాలు వ్రాసిన డా. గౌరీశంకర్ (హైదరాబాద్), డా. పి.బి.డి.వి. ప్రసాద్, డా. గెలివి సహదేవుడు వారికి ధన్యవాదములు...
© 2017,www.logili.com All Rights Reserved.