వర్షం పడుతున్నప్పుడు ఒక్కో ఊరిలో ఒక్కో అందం. మా ఊరు మిలిటరీ మాధవరం లో ఒక అందం. మా మేనత్త గారి ఊరు గోపవరంలో ఒక అందం. అమ్మమ్మ గారి ఊరు తునిలో ఒక అందం. మా ఊరిలో మా ఇల్లు ఊరి చివర లో ఎత్తు మీద ఉండేది. మా నాన్నగారి గది కిటికీలోంచి వర్షం లో తడుస్తున్న పచ్చటి వరి పొలాలు చూస్తూ ఉంటె ఎన్నెన్నో జ్ఞాపకాలు. అప్పటి 1960స్ 1970స్ కాలం నాటికి మా ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ లైఫ్ లో జరిగిన ఎన్నెన్నో సంఘటనలు గుర్తుకొస్తుంటే వాటిని పేస్ బుక్ లో కథల బొమ్మల రూపం లో చేసిన పోస్ట్స్ లో కొన్నిటిని పుస్తక రూపంలో తీసుకొచ్చాను. నేను కార్టూనిస్ట్ శ్రీ బి. వి. సత్యమూర్తి గారు చిత్రకారులు శ్రీ శిలావీర్రాజు గారి దగ్గర కమర్షియల్ ఆర్టిస్ట్ గా సహాయకుడిగా ఉన్న రోజుల్లో వారి కార్టూన్స్, రచనలు నా మీద కొంత ప్రభావం చూపించడం వలననే ఈ రోజు ఈ బుక్ పబ్లిష్ చేశాను.
- ఆచంట. వి. సుబ్రహ్మణ్యం.