ఇప్పటికే కథ రచనలో బాగా అనుభవజ్ఞులైన మారోజూ సూర్యప్రసాదరావు గారు ఈ సరికొత్త కధాసంపుటి "దీక్ష " లోని కథలు సద్భావాలకు ప్రతీకలు, సత్ప్రవర్తనకి సూచికలు. వ్యక్తిలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ, మంచిమార్పులు రావాలనే దీక్షతో ... ఉదేశంతో కాకుండా... ఉత్సాహంతోను, ఉల్లాసంతోనూ రాసినవి ఈ సంపుటిలోని కథలు. పాఠకులకు ఉత్సాహం, ఉల్లాసం కలిగించే విధంగా సరళముగా, గంభీరంగానూ, సర్దాగానూ రాసిన కథలు. అందుకే చదువుతుంటే మనసు బిగదీసుకు పోకుండా విచ్చుకుంటుంది. రకరకాల వాదాల ఈదురు గాలుల్ని ఎదుర్కొన్నట్లు కాకుండా, సేదదీరే చల్లని గాలి వీస్తున్నట్లు ఉంటుంది... చదువుతుంటే!
పత్రికలలో ఒక రచయిత కథలు అప్పుడప్పుడు చదివినప్పుడు క్షణికమైన స్పందన కలిగి అంతలోనే సాధారణంగా మరుగున పడిపోతుంది. కానీ ఆ రచయిత రాసిన కథలు కొన్నింటిని ఒక్కసారిగా చదివినప్పుడు ఆ రచయిత మనస్తత్వం, దృక్పధం, ఆలోచనా ధోరణి స్పష్టంగా అర్ధమవుతాయి.
-సూర్య ప్రసాదరావు.