కథల్లో హాస్యం, వ్యంగ్యం బాగా ప్రవేశించినై. హాస్యంకి మూడు దశలున్నాయి. మొదటిది కేవలం నవ్వించడమే (సినిమాల నిండా ఇదే). రెండోది వ్యంగ్యంతో కలిసి ఉండటం. మూడోది పైకి హాస్యంగా, వ్యంగ్యంగా ఉంటూనే గంభీరమైన జీవన సత్యాన్ని చాపకింద నీటిలా అందించడం. పైకి నవ్విస్తూ, లోపల కన్నీరు తెప్పించే విధానం కూడా ఈ పై అంశపు విశాల పరిధిలోకే వస్తుంది. ఈ మూడు ధోరణీల్ని షేక్ మస్తాన్ వలి తన కథాసంపుటిలో సమర్థంగా వినియోగించగలిగారు.
ఈ కథాసంపుటిలో హాస్యమే కేంద్ర భిందువుగా వున్న కథలు, విముక్తి, ఊసరవెల్లులు, తుంగబుర్ర, ఎవడి పిచ్చి వాడికానందం, చిల్లతుమ్మ. అయితే ఈ రచయిత హాస్యం కేవలం వక్రసంభాషణలు, వక్రచేష్టలు మొదలైన వాటి మీద ఆధారపడి, ఏ ప్రయోజనము లేనివిగా ఉండవు. సంఘటనల్లో గానీ, పాత్రచిత్రణలో గాని, ఏదో ఒక విశిష్టత ఉంటుంది. పాఠకుడు సమాజ జీవితంలో నేర్చుకోవలసి౦ది ఉంటుంది.
ఈ సంపుటిలో కొన్ని సీరియస్ గా నడిచిన కథలూ ఉన్నై. అవి రచయిత పాత్ర చిత్రణ నైపుణ్యానికీ, రసపోషణ చాతుర్యానికీ నిదర్శనంగా ఉంటాయి.
- శ్రీ అద్దేపల్లి రామమోహనరావు
కథల్లో హాస్యం, వ్యంగ్యం బాగా ప్రవేశించినై. హాస్యంకి మూడు దశలున్నాయి. మొదటిది కేవలం నవ్వించడమే (సినిమాల నిండా ఇదే). రెండోది వ్యంగ్యంతో కలిసి ఉండటం. మూడోది పైకి హాస్యంగా, వ్యంగ్యంగా ఉంటూనే గంభీరమైన జీవన సత్యాన్ని చాపకింద నీటిలా అందించడం. పైకి నవ్విస్తూ, లోపల కన్నీరు తెప్పించే విధానం కూడా ఈ పై అంశపు విశాల పరిధిలోకే వస్తుంది. ఈ మూడు ధోరణీల్ని షేక్ మస్తాన్ వలి తన కథాసంపుటిలో సమర్థంగా వినియోగించగలిగారు. ఈ కథాసంపుటిలో హాస్యమే కేంద్ర భిందువుగా వున్న కథలు, విముక్తి, ఊసరవెల్లులు, తుంగబుర్ర, ఎవడి పిచ్చి వాడికానందం, చిల్లతుమ్మ. అయితే ఈ రచయిత హాస్యం కేవలం వక్రసంభాషణలు, వక్రచేష్టలు మొదలైన వాటి మీద ఆధారపడి, ఏ ప్రయోజనము లేనివిగా ఉండవు. సంఘటనల్లో గానీ, పాత్రచిత్రణలో గాని, ఏదో ఒక విశిష్టత ఉంటుంది. పాఠకుడు సమాజ జీవితంలో నేర్చుకోవలసి౦ది ఉంటుంది. ఈ సంపుటిలో కొన్ని సీరియస్ గా నడిచిన కథలూ ఉన్నై. అవి రచయిత పాత్ర చిత్రణ నైపుణ్యానికీ, రసపోషణ చాతుర్యానికీ నిదర్శనంగా ఉంటాయి. - శ్రీ అద్దేపల్లి రామమోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.