ట్రిగర్ అలెర్ట్
అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయికి కూర్చుని ఉండడం అలవాటు. అటుగా వెళ్తూ, చెట్టుకింద కూర్చున్న అబ్బాయిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది ఒక అమ్మాయి. నవ్వూ నవ్వూ, మాటా మాటా, చేయీ చేయీ కలిశాక ఆడుకుందాం రమ్మని అడుగుతుంది. ఆ అబ్బాయి కదలడు. సరేలే అని అనుకుని వెళ్ళిపోతుంది.
మళ్ళీ మరుసటి రోజున వస్తుంది. నవ్వుతుంది. పలకరిస్తుంది. ఆడుకుందామని అడుగుతుంది. నవ్వుతాడు, పలకరిస్తాడు, కానీ కదలడు.
మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నవ్వుతుంటుంది. పలకరిస్తుంటుంది.
ఆడుకుందామని అడుగుతూ ఉంటుంది. వాడు కదలడు.
మళ్ళీ వస్తుంది. నవ్వకుండానే, పలకరించకుండానే ఆడుకుందామని
అడుగుతుంది.
వాడు కదలకపోయేసరికి దానికి కోపం వస్తుంది. ఒక మాట అంటుంది విసురుగా. ఆడకపోతే మళ్ళీ రానని బెదిరిస్తుంది. అయినా వాడు కదలడు. దానికి ఓపిక నశించి ఇంకో రెండు మాటలనేసి వెళ్ళిపోతుంది.
అయినా మళ్ళీ తిరిగొస్తుంది. ఈ సారి ఏడుస్తుంది. ఒక్కసారైనా కదలవూ
అని బతిమాలుతుంది.
“నాతో ఎందుకు ఆడవు? నేను మంచిదాన్ని కానా?" అని తనని తాను నిందించుకుంటుంది. చేయి పట్టుకుని రెండు అడుగులు వేస్తే అరిగిపోతావా అని నిష్టూరాలాడుతుంది.
వాడు కదలడు..........
ట్రిగర్ అలెర్ట్ అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక అబ్బాయికి కూర్చుని ఉండడం అలవాటు. అటుగా వెళ్తూ, చెట్టుకింద కూర్చున్న అబ్బాయిని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది ఒక అమ్మాయి. నవ్వూ నవ్వూ, మాటా మాటా, చేయీ చేయీ కలిశాక ఆడుకుందాం రమ్మని అడుగుతుంది. ఆ అబ్బాయి కదలడు. సరేలే అని అనుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజున వస్తుంది. నవ్వుతుంది. పలకరిస్తుంది. ఆడుకుందామని అడుగుతుంది. నవ్వుతాడు, పలకరిస్తాడు, కానీ కదలడు. మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. నవ్వుతుంటుంది. పలకరిస్తుంటుంది. ఆడుకుందామని అడుగుతూ ఉంటుంది. వాడు కదలడు. మళ్ళీ వస్తుంది. నవ్వకుండానే, పలకరించకుండానే ఆడుకుందామని అడుగుతుంది. వాడు కదలకపోయేసరికి దానికి కోపం వస్తుంది. ఒక మాట అంటుంది విసురుగా. ఆడకపోతే మళ్ళీ రానని బెదిరిస్తుంది. అయినా వాడు కదలడు. దానికి ఓపిక నశించి ఇంకో రెండు మాటలనేసి వెళ్ళిపోతుంది. అయినా మళ్ళీ తిరిగొస్తుంది. ఈ సారి ఏడుస్తుంది. ఒక్కసారైనా కదలవూ అని బతిమాలుతుంది. “నాతో ఎందుకు ఆడవు? నేను మంచిదాన్ని కానా?" అని తనని తాను నిందించుకుంటుంది. చేయి పట్టుకుని రెండు అడుగులు వేస్తే అరిగిపోతావా అని నిష్టూరాలాడుతుంది. వాడు కదలడు..........© 2017,www.logili.com All Rights Reserved.