పరలోక ధ్యాస ప్రబలంగా ఉన్న సంప్రదాయ సాహిత్యంలో సంఘం, వ్యక్తుల సమస్యలు మరుగునపడిన నేపథ్యంలో ఆధునికత ప్రభావంతో తెలుగు సాహిత్యంలో కందుకూరి, గురుజాడ మొదలయిన వారి ప్రాబల్యంతో సాహిత్యం సంఘం వైపు, ఉహలోకం వైపు దృష్టిని మరల్చింది. ఇలా మారిన దృష్టి వైపు తరువాత రచయితలు, వివిధ శ్రేణులలో, మార్గాలలో, పాళ్లతో, ప్రబలంగా ముందుకెళ్లారు. కొన్ని వేల సమస్యలు లేక ఒక సమస్యలోని పలు పార్శ్వాలను వర్ణిస్తూ రచనలు చేశారు. ఉధృతంగా సాగిన ఈ ప్రయాణంలో ఈ ఊపులో కొన్ని అంశాలు, సమస్యలు గుర్తించలేక వెనకనే మిగిలిపోయాయి. మిగిలిపోయిన, కొత్తగా ప్రాముఖ్యం సంతరించుకున్న విషయాలను రెండవతరం రచయితలు సూక్ష్మంగా గమనిస్తూ, శ్రద్ధగా వెతుకుతూ, నిశితంగా పరిశీలిస్తూ రచనలు చేశారు, చేస్తున్నారు. ఈ కోవకు చెందిన కథలు భారతి కథలు. ఈ నేపధ్యమున్న ఈ కథలను జాగ్రత్తగా చదవాలి.
- తుమ్మపూడి భారతి