విభజన రేఖపై నిరసన కేక!
గీతాంజలి కథలను ఇప్పుడు నేను కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. 'బచ్చేదాని' కథా సంపుటికి ముందు నుంచీ.. అంటే గత పధ్నాలుగేళ్లుగా అచ్చులోకి తెచ్చిన కథల్లో ఆమె తీసుకుంటున్న ఇతివృత్తాలూ, వాటి కథనరూపం ప్రత్యేకంగా వుంటాయనీ / చాలా మంది కథకుల కంటే భిన్నమైన తోవలో ఆమె ప్రయాణిస్తోందనీ తెలుగు కథాపాఠకులకు తెలుసు. కొన్ని శతాబ్దాలుగా మన జీవితాల్లో విడదీయలేని భాగంగా కలగలిసిపోయిన ముస్లిం సమాజాన్ని గురించి, కొన్ని దశాబ్దాలుగా ఆ విడదీయలేని భాగాన్ని విడదీసేందుకు జరుగుతూన్న కుట్ర గురించి గీతాంజలి రాస్తోంది. ఈ విభజన రేఖకి అటూ ఇటూ విషాదంగా సర్దుకుపోతున్న / సర్దుకుపోలేని ముస్లిం స్త్రీల ఉనికి, పోరాటం గీజాంజలి కథలకు ఇతివృత్తం. అట్లాగని.. ఈ కథల్ని కేవలం ముస్లిం స్త్రీలకే పరిమితం చెయ్యలేం. ముస్లిం స్త్రీ కేంద్ర స్థానంగా హిందూ ముస్లిం సమాజాల్లో జరుగుతూన్న చలనాలు ఈ కథలకు ఆయువుపట్టు. తెలుగు కథాసాహిత్యంలో గీతాంజలిని ఒక రచయితగా ప్రత్యేకంగా నిలబెడ్తున్న అంశం ఇది. గీతాంజలి రెండో కథాసంపుటి 'పహెచాన్’ వెలువడ్తున్న సందర్భంలో ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటన్నిటికి భిన్నమైన అనేక కొత్త అంశాలు ఇప్పుడు ఈ 'పహెచాన్' ద్వారా మనకు పరిచయ మవుతున్నాయి. తెలంగాణ చరిత్ర.. ఆ మాటకొస్తే.. తెలుగు చరిత్ర పునర్నిర్మాణానికి బహుముఖాల అన్వేషణ సాగుతున్న ప్రస్తుత దశలో గీతాంజలి కథల్ని ఆ కోణం నుంచి చర్చించాల్సిన అవసరం వుంది.-
గీతాంజలి కథల్లోని ముస్లిం సమాజం', ప్రత్యేకించి హిందూ-ముస్లిం సరిహద్దు రేఖల మధ్య వున్న సమాజం, ఆ సమాజంలోని స్త్రీలు, హింస, అణచివేత, ఆర్థిక సంఘర్షణ, పాత కొత్త సంస్కృతుల అస్తిత్వపోరాటం.. వీటికి తెలుగు సమాజంతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథల ద్వారా గీతాంజలి మనకు కలిగిస్తున్న 'పహెచాన్'......................
విభజన రేఖపై నిరసన కేక! గీతాంజలి కథలను ఇప్పుడు నేను కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. 'బచ్చేదాని' కథా సంపుటికి ముందు నుంచీ.. అంటే గత పధ్నాలుగేళ్లుగా అచ్చులోకి తెచ్చిన కథల్లో ఆమె తీసుకుంటున్న ఇతివృత్తాలూ, వాటి కథనరూపం ప్రత్యేకంగా వుంటాయనీ / చాలా మంది కథకుల కంటే భిన్నమైన తోవలో ఆమె ప్రయాణిస్తోందనీ తెలుగు కథాపాఠకులకు తెలుసు. కొన్ని శతాబ్దాలుగా మన జీవితాల్లో విడదీయలేని భాగంగా కలగలిసిపోయిన ముస్లిం సమాజాన్ని గురించి, కొన్ని దశాబ్దాలుగా ఆ విడదీయలేని భాగాన్ని విడదీసేందుకు జరుగుతూన్న కుట్ర గురించి గీతాంజలి రాస్తోంది. ఈ విభజన రేఖకి అటూ ఇటూ విషాదంగా సర్దుకుపోతున్న / సర్దుకుపోలేని ముస్లిం స్త్రీల ఉనికి, పోరాటం గీజాంజలి కథలకు ఇతివృత్తం. అట్లాగని.. ఈ కథల్ని కేవలం ముస్లిం స్త్రీలకే పరిమితం చెయ్యలేం. ముస్లిం స్త్రీ కేంద్ర స్థానంగా హిందూ ముస్లిం సమాజాల్లో జరుగుతూన్న చలనాలు ఈ కథలకు ఆయువుపట్టు. తెలుగు కథాసాహిత్యంలో గీతాంజలిని ఒక రచయితగా ప్రత్యేకంగా నిలబెడ్తున్న అంశం ఇది. గీతాంజలి రెండో కథాసంపుటి 'పహెచాన్’ వెలువడ్తున్న సందర్భంలో ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటన్నిటికి భిన్నమైన అనేక కొత్త అంశాలు ఇప్పుడు ఈ 'పహెచాన్' ద్వారా మనకు పరిచయ మవుతున్నాయి. తెలంగాణ చరిత్ర.. ఆ మాటకొస్తే.. తెలుగు చరిత్ర పునర్నిర్మాణానికి బహుముఖాల అన్వేషణ సాగుతున్న ప్రస్తుత దశలో గీతాంజలి కథల్ని ఆ కోణం నుంచి చర్చించాల్సిన అవసరం వుంది.- గీతాంజలి కథల్లోని ముస్లిం సమాజం', ప్రత్యేకించి హిందూ-ముస్లిం సరిహద్దు రేఖల మధ్య వున్న సమాజం, ఆ సమాజంలోని స్త్రీలు, హింస, అణచివేత, ఆర్థిక సంఘర్షణ, పాత కొత్త సంస్కృతుల అస్తిత్వపోరాటం.. వీటికి తెలుగు సమాజంతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథల ద్వారా గీతాంజలి మనకు కలిగిస్తున్న 'పహెచాన్'......................© 2017,www.logili.com All Rights Reserved.