వెంటాడే కథలు
మార్చ్ 1న వరంగల్ జిల్లా పరకాల, ఆత్మకూరు, రేగొండ మండలాలలో రైతుల ఆత్మహత్యల గురించి ఆ కుటుంబాలతో మాట్లాడుదామని విప్లవ రచయితల సంఘం హైదరాబాదు, వరంగల్ యూనిట్లు వెళ్లి వచ్చాయి. మరణించిన రైతుల కుటుంబాల స్థితిగతులు చూసి ముఖ్యంగా స్త్రీలు, పిల్లల వేదన, భవిష్యత్తుల గురించి గీతాంజలి చాలా చలించిపోయింది. పరకాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్మారక ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలోను, తిరుగు ప్రయాణంలోను ఆమె చేసిన విశ్లేషణ, వ్యాఖ్య నాకు 'ఔనా!?' అనిపించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రైతుల ఆత్మహత్యను ప్రోత్సహించడం, లేదా నిలవరించడానికి ప్రయత్నాలు చేయకపోవడం, వాటిపై నోరు విప్పక పోవడం, ఆ కుటుంబాలను పరామర్శించక పోవడం ఒక కుట్ర అంటుంది ఆమె. ప్రభుత్వాలు - అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేంద్రం కావచ్చు భూఆక్రమణ ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయి. వివిధ స్వార్థ ప్రయోజనాల కోసం - బహుళ జాతి కంపెనీల కోసం కావచ్చును. మన దేశంలోని బడా కంపెనీల కోసం కావచ్చు. ఇక్కడ రియల్టర్ల కోసం కావచ్చు. పాలక వర్గ పార్టీల కోసం కావచ్చు. ప్రభుత్వం కోసం కావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు కోసం కావచ్చు. భూమి సంశయం చేయాలి. అందుకని కౌలు తీసుకుని వేసేవాళ్లు మొదలు, మధ్య తరగతి రైతుల దాకా మొదట సంప్రదాయ పంటల గురించి కాకుండా వ్యాపార పంటల గురించి ప్రోత్సహించి, అందుకు తమ బినామీలయిన విత్తనాల, ఎరువుల, పురుగుమందుల కంపెనీల నుంచే ఎక్కువ దిగుబడి ఆశలతో, భ్రమలతో కొనడానికి ప్రోత్సహించి, అందుకోసం ప్రైవేటు అప్పులు విపరీతమైన వడ్డీ రేట్లకు చేయడానికి ప్రోత్సహించి అప్పుల్లో కూరుకుపోయి, అవి పెరుగుతూ పోతే ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిని నెట్టి వ్యవసాయాన్ని నిరుత్సాహపరచడం, అట్లా పడావు పడిన భూములను ఆక్రమించుకోవడం కూడా అనేక మార్గాల్లో ఒకటని ఆమె బలంగా.............................
వెంటాడే కథలు మార్చ్ 1న వరంగల్ జిల్లా పరకాల, ఆత్మకూరు, రేగొండ మండలాలలో రైతుల ఆత్మహత్యల గురించి ఆ కుటుంబాలతో మాట్లాడుదామని విప్లవ రచయితల సంఘం హైదరాబాదు, వరంగల్ యూనిట్లు వెళ్లి వచ్చాయి. మరణించిన రైతుల కుటుంబాల స్థితిగతులు చూసి ముఖ్యంగా స్త్రీలు, పిల్లల వేదన, భవిష్యత్తుల గురించి గీతాంజలి చాలా చలించిపోయింది. పరకాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్మారక ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలోను, తిరుగు ప్రయాణంలోను ఆమె చేసిన విశ్లేషణ, వ్యాఖ్య నాకు 'ఔనా!?' అనిపించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రైతుల ఆత్మహత్యను ప్రోత్సహించడం, లేదా నిలవరించడానికి ప్రయత్నాలు చేయకపోవడం, వాటిపై నోరు విప్పక పోవడం, ఆ కుటుంబాలను పరామర్శించక పోవడం ఒక కుట్ర అంటుంది ఆమె. ప్రభుత్వాలు - అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేంద్రం కావచ్చు భూఆక్రమణ ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయి. వివిధ స్వార్థ ప్రయోజనాల కోసం - బహుళ జాతి కంపెనీల కోసం కావచ్చును. మన దేశంలోని బడా కంపెనీల కోసం కావచ్చు. ఇక్కడ రియల్టర్ల కోసం కావచ్చు. పాలక వర్గ పార్టీల కోసం కావచ్చు. ప్రభుత్వం కోసం కావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు కోసం కావచ్చు. భూమి సంశయం చేయాలి. అందుకని కౌలు తీసుకుని వేసేవాళ్లు మొదలు, మధ్య తరగతి రైతుల దాకా మొదట సంప్రదాయ పంటల గురించి కాకుండా వ్యాపార పంటల గురించి ప్రోత్సహించి, అందుకు తమ బినామీలయిన విత్తనాల, ఎరువుల, పురుగుమందుల కంపెనీల నుంచే ఎక్కువ దిగుబడి ఆశలతో, భ్రమలతో కొనడానికి ప్రోత్సహించి, అందుకోసం ప్రైవేటు అప్పులు విపరీతమైన వడ్డీ రేట్లకు చేయడానికి ప్రోత్సహించి అప్పుల్లో కూరుకుపోయి, అవి పెరుగుతూ పోతే ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిని నెట్టి వ్యవసాయాన్ని నిరుత్సాహపరచడం, అట్లా పడావు పడిన భూములను ఆక్రమించుకోవడం కూడా అనేక మార్గాల్లో ఒకటని ఆమె బలంగా.............................© 2017,www.logili.com All Rights Reserved.