సమస్యల్ని చిత్రించడమే కాదు, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన సూచనలు ఏమైనా చేయాలనే తపన ఉన్న కథా రచయిత గన్నవరం నరసింహమూర్తి. వ్యవస్థపై ధిక్కారం ప్రకటించే వారి చర్యల్ని ప్రత్యేకంగా చర్చిస్తారు. గ్లోబలైజేషన్ పరిణామాలు మానవ జీవితం పై చూపుతున్న ప్రభావాన్ని విశదీకరిస్తారు. ప్రజలు చట్టాన్ని నమ్మి, దాని పరిధిలో జీవించాలంటే దాన్ని అమలు చేసేవారు పారదర్శకంగా ఉండాలి. అలా లేనప్పుడు వాటిల్లే పరిణామాలు ఎంత భీకరంగా ఉంటాయో చెప్పకనే చెబుతారు. మానవ ప్రవర్తననీ, మానవ స్వభావంలోని వైరుధ్యాల్నీ ప్రత్యేకంగా చర్చించారు.
మూసపోసినట్టుగా ఉండదు జీవితం. కొన్ని సూత్రాల పరిధిలో ఒదగదు. ఘర్షణ అనివార్యం. ఘర్షణకు దారితీసే పరిస్థితులు సంఘంలోనే ఉన్నాయి. అయితే నిత్యం ఘర్షణ పడుతూ బతకడం కష్టం. అందువల్లనే వాటిని మరిచిపోడానికి ప్రయత్నిస్తారు ఈ విధమైన జీవన వాస్తవికతను గుర్తించడం అవసరం. మనుషులకు ఈ ఎరుకని కలిగిస్తూ, సాటివారికి తగిన చేయూతని అందించాలన్న తపన పాఠకుల్లో ప్రోది చేసే లక్షణం ఈ కథలకు ఉంది.
సమస్యల్ని చిత్రించడమే కాదు, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన సూచనలు ఏమైనా చేయాలనే తపన ఉన్న కథా రచయిత గన్నవరం నరసింహమూర్తి. వ్యవస్థపై ధిక్కారం ప్రకటించే వారి చర్యల్ని ప్రత్యేకంగా చర్చిస్తారు. గ్లోబలైజేషన్ పరిణామాలు మానవ జీవితం పై చూపుతున్న ప్రభావాన్ని విశదీకరిస్తారు. ప్రజలు చట్టాన్ని నమ్మి, దాని పరిధిలో జీవించాలంటే దాన్ని అమలు చేసేవారు పారదర్శకంగా ఉండాలి. అలా లేనప్పుడు వాటిల్లే పరిణామాలు ఎంత భీకరంగా ఉంటాయో చెప్పకనే చెబుతారు. మానవ ప్రవర్తననీ, మానవ స్వభావంలోని వైరుధ్యాల్నీ ప్రత్యేకంగా చర్చించారు. మూసపోసినట్టుగా ఉండదు జీవితం. కొన్ని సూత్రాల పరిధిలో ఒదగదు. ఘర్షణ అనివార్యం. ఘర్షణకు దారితీసే పరిస్థితులు సంఘంలోనే ఉన్నాయి. అయితే నిత్యం ఘర్షణ పడుతూ బతకడం కష్టం. అందువల్లనే వాటిని మరిచిపోడానికి ప్రయత్నిస్తారు ఈ విధమైన జీవన వాస్తవికతను గుర్తించడం అవసరం. మనుషులకు ఈ ఎరుకని కలిగిస్తూ, సాటివారికి తగిన చేయూతని అందించాలన్న తపన పాఠకుల్లో ప్రోది చేసే లక్షణం ఈ కథలకు ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.