నాట్య శాస్త్రకర్త భారతమహాముని ప్రవచనంలో రసాలు ఎనిమిదిగా బోధించబడ్డాయి. శిష్యులకి! అలాగే 'హాసం' స్థాయి భావాత్మకంగా చెప్పాడు. హాసం హాస్యభావజనిత. అది ఉత్తమ, మధ్యమ, అథమ అనే మూడు భేదాలతో ఆరు రకాలుగా సాగింది - "హాసం షడ్విధం" అంటూ స్మిత/హాసిత/విహసిత/ఉపహసిత/అతిహసిత/ అట్ట హాసాలుగా వివరించాడు. అష్టరసాల్లో ద్వితీయ స్థానాన్ని పొందిన హాస్యరసం వాస్తవానికి అన్ని రసాల్లోనూ దాగి ఉంటుంది. ఏ రసం తాలూకు భావాలు విఫలం చెందినా అవి హాస్య రసానికే దారితీస్తాయి - "నదీనాం సాగరం గచ్ఛoతి" అన్నట్లు రసాలు ఎనిమిదైనా, తొమ్మిదైనా హాస్యరసం అన్నిట్లో పొంచి ఉంటుంది ఎపుడు నవ్విద్దామా అని !!
- వియోగి, ఏవిఎమ్, టి. ఎస్. ఎ. కృష్ణమూర్తి