ఆంగ్ల వాజ్ఞయ చరిత్రలో, నవలా రచనకు తొలుదొల్తగా అంకురార్పణ చేసినవాడు సర్ వాల్టర్ స్కాట్ అని చెప్పవచ్చు. ఇతని జననం 1771 . మరణం 1832 . ప్రారంభ దశలో చక్కని పద్యకావ్యాలు రచించి కీర్తి గడించి. పిమ్మట నవలా రచనకుపక్రమించాడు . "వేవర్లి" అనే మొట్టమొదటి నవలను ముందు పేరు లేకుండా ప్రకటించాడు. పెక్కు సంవత్సరాల వరకు, ఈ నవలా రచయిత యెవ్వరా అని, ఆంగ్ల పాఠకలోకం ఉత్కంఠ చెందుతూ ఉండేది. ఎవరో ఒక గొప్ప రచయిత వాజ్ఞయ ప్రపంచంలోకి క్రొత్తగా అవతరించాడని చెప్పుకోసాగారు.
ఈ తొలి విజయంతో ఉత్సాహితుడై. స్కాట్ తరువాత పెక్కు నవలలను తన పేరుతోనే ప్రకటించాడు. ఇరవై నాలుగు సంపుటాలుగా వెలువడ్డ ఈ నవలలు. |"వేవర్లి సిరీస్" అనే పెరుతో ప్రసిద్దిచెందాయి. అన్ని జనాదరణ పొందినవే కానీ. వాటిలోకెల్ల ముఖ్యంగా చెప్పుకో దగినది ఈ "ఇవాన్ హో". క్రీస్తుశకం 12 వ శాతాబ్దిలో ప్రసిద్ధి గాంచిన ఒకటవ రిచర్డు కాలంలో జరిగినట్లు వర్ణితమైన విరగాథ ఇది.