పొత్తూరి విజయలక్ష్మిగారి రచనా వ్యాసంగం 1982లో ప్రారంభమైంది. మొదటి నవల 'ప్రేమలేఖ' - 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా వచ్చింది. 250 కథలు, 20 నవలలు రచించారు. 3 సినిమాలు, అనేక టి. వి. సీరియల్స్ రేడియో నాటికలు, కాలమ్ లకు రచనలు చేశారు. రేడియో ప్రసంగాలు చేశారు. అనేక నవలలు పుస్తకరూపంలో వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 'నోస్టాల్జియా' అనే కాలమ్ నిర్వహిస్తున్నారు.
కడుపుబ్బ నవ్వించే కథలు కంటతడి పెట్టించే కథలు సరిసమానంగా రాయగల సవ్యసాచి. పాఠకులకు అభిమాన రచయిత్రి.
విజయలక్ష్మి గారికి 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది. అదే సంవత్సరంలో తురగా కృష్ణమోహనరావు స్మారక పురస్కారం కూడా పొందారు. 2009 సంవత్సరపు శేషారత్నం స్మారక హాస్యకథా పురస్కారం 2012లో గహాలక్ష్మి పురస్కారం పొందారు.
- పొత్తూరి విజయలక్ష్మి