ఐ లవ్ యూ డాక్టర్
బయటకుంభవృష్టి.
వర్షానికి తోడు కరెంటు లేదు. జనరేటర్ చప్పుడు చేస్తుంది. హాల్లో లైటు వెలుగుతోంది. ఇంట్లోని జనాభా అంతా అక్కడే వున్నారు. అనసూయమ్మ దివానీమీద చేరబడి పుస్తకం తిరగేస్తుంది. ఆవిడకి కాస్త దూరంలో కూర్చుని రాత్రికూరకోసం బెండకాయలు తరుగుతోంది సుజాత. సోఫాలో డాక్టర్ శ్రీనివాస్, ఆయన పక్కనే శ్రీవిద్య, కిలకిల నవ్వుతూ తండ్రితో మాట్లాడుతోంది.
అందులో విచిత్రం ఏమీలేదు. విద్య ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. అందులోనూ చేతిలో జోక్స్ బుక్ పట్టుకుని వుంది. ఇక చెప్పాలా? తను నవ్వడమే కాకుండా అందర్నీ నవ్వించేస్తుంది.
గట్టిగా తలుపు శబ్దం కావడంతో ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. సుజాత వెళ్లి తలుపు తీసింది. ఆదుర్దాగా లోపలికి వచ్చింది శాంతమ్మ. చీరె సగానికి సగం తడిసిపోయింది. “ఈ పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు. పొద్దుననగా వెళ్లాడు. ఎడతెరిపి లేకుండా వర్షం. ఎక్కడికి పోయాడో ఏం చేస్తున్నాడో” వస్తూనే ప్రారంభించింది.
అందరూ ఓసారి మొహమొహాలు చూసుకుని ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు.
ఐ లవ్ యూ డాక్టర్బయటకుంభవృష్టి. వర్షానికి తోడు కరెంటు లేదు. జనరేటర్ చప్పుడు చేస్తుంది. హాల్లో లైటు వెలుగుతోంది. ఇంట్లోని జనాభా అంతా అక్కడే వున్నారు. అనసూయమ్మ దివానీమీద చేరబడి పుస్తకం తిరగేస్తుంది. ఆవిడకి కాస్త దూరంలో కూర్చుని రాత్రికూరకోసం బెండకాయలు తరుగుతోంది సుజాత. సోఫాలో డాక్టర్ శ్రీనివాస్, ఆయన పక్కనే శ్రీవిద్య, కిలకిల నవ్వుతూ తండ్రితో మాట్లాడుతోంది. అందులో విచిత్రం ఏమీలేదు. విద్య ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. అందులోనూ చేతిలో జోక్స్ బుక్ పట్టుకుని వుంది. ఇక చెప్పాలా? తను నవ్వడమే కాకుండా అందర్నీ నవ్వించేస్తుంది. గట్టిగా తలుపు శబ్దం కావడంతో ఆ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. సుజాత వెళ్లి తలుపు తీసింది. ఆదుర్దాగా లోపలికి వచ్చింది శాంతమ్మ. చీరె సగానికి సగం తడిసిపోయింది. “ఈ పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు. పొద్దుననగా వెళ్లాడు. ఎడతెరిపి లేకుండా వర్షం. ఎక్కడికి పోయాడో ఏం చేస్తున్నాడో” వస్తూనే ప్రారంభించింది. అందరూ ఓసారి మొహమొహాలు చూసుకుని ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు.© 2017,www.logili.com All Rights Reserved.