నవలా, కథారచయిత్రిగా మంథా భానుమతిగారి పేరు సుపరిచితమే. పదహారు నవలలూ, అరవై పైగా కథలూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్నింటికి బహుమతులు కూడా లభించాయి. 'అనంతవాహిని' కథాసంకలనం, 'రామాయణం మామయ్యా', 'గ్లేషియర్' నవలలు ప్రచురించారు. ఇది వారి నాల్గవ పుస్తకం. భానుమతిగారిది మహోన్నతమైన వ్యక్తిత్వం. కొంత గాంభీర్యం, కొంత హాస్యం, బోలెడంత అమ్మతనం.. ఇవన్నీ కలబోసినా మనస్తత్వం ఆమెది.
ఈ కథల్లో అడుగడుగునా ఆమె కనిపిస్తారు. మనందరం చిన్నప్పుడు ఏ అమ్మో, అక్కో కథ చెపుతుంటే ఎలా హాయిగా విన్నామో, చదివేటప్పుడు అలాగే ఫీలయి చదువుతాం. ఏ పాత్రా మనకి 'అర్థం' కానీ పాత్ర కాదు. అంత సులభగ్రాహ్యంగా ఉంటాయి కథలు. ప్రతి కథా మనం చదువుతున్నట్లు ఉండదు. ఆ కథ మన కళ్ళ ముందు కదులుతున్నట్లు ఉంటుంది. 'జీవనవాహిని'లో అధికంగా స్త్రీలు, వారి సమస్యలే కథావస్తువులయ్యాయి. ఆధునిక సమాజంలో స్త్రీల పాత్ర, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నిస్సహాయతలు, ఆవేశాలు, పరిష్కారమార్గాలు, అమ్మగా స్త్రీ భావాలు కొన్ని కథల్లో విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను.
నవలా, కథారచయిత్రిగా మంథా భానుమతిగారి పేరు సుపరిచితమే. పదహారు నవలలూ, అరవై పైగా కథలూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్నింటికి బహుమతులు కూడా లభించాయి. 'అనంతవాహిని' కథాసంకలనం, 'రామాయణం మామయ్యా', 'గ్లేషియర్' నవలలు ప్రచురించారు. ఇది వారి నాల్గవ పుస్తకం. భానుమతిగారిది మహోన్నతమైన వ్యక్తిత్వం. కొంత గాంభీర్యం, కొంత హాస్యం, బోలెడంత అమ్మతనం.. ఇవన్నీ కలబోసినా మనస్తత్వం ఆమెది. ఈ కథల్లో అడుగడుగునా ఆమె కనిపిస్తారు. మనందరం చిన్నప్పుడు ఏ అమ్మో, అక్కో కథ చెపుతుంటే ఎలా హాయిగా విన్నామో, చదివేటప్పుడు అలాగే ఫీలయి చదువుతాం. ఏ పాత్రా మనకి 'అర్థం' కానీ పాత్ర కాదు. అంత సులభగ్రాహ్యంగా ఉంటాయి కథలు. ప్రతి కథా మనం చదువుతున్నట్లు ఉండదు. ఆ కథ మన కళ్ళ ముందు కదులుతున్నట్లు ఉంటుంది. 'జీవనవాహిని'లో అధికంగా స్త్రీలు, వారి సమస్యలే కథావస్తువులయ్యాయి. ఆధునిక సమాజంలో స్త్రీల పాత్ర, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నిస్సహాయతలు, ఆవేశాలు, పరిష్కారమార్గాలు, అమ్మగా స్త్రీ భావాలు కొన్ని కథల్లో విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను.© 2017,www.logili.com All Rights Reserved.