1932 లో తెలుగు సినిమా పుట్టింది. 1936లో తోలి సాంఘిక చిత్రం ప్రేమవిజయం వచ్చింది. అంత వరకు వచ్చిన పురాణ కథల్ని చుసిన ప్రేక్షకులకి సాంఘికం రుచించలేదు. సాంఘికాలకు కాలంకాదని నిర్మాణ సంస్థలు మౌనం వహించినా సంచలన చిత్రకారుడు గూడవల్లి రామబ్రహ్మం సాంఘికాలకు మళ్లీ గంట కొట్టాడు. 1938లో వచ్చిన మాలపిల్ల ప్రేక్షక మేఘాలచేత కనక వర్షం కురిపించింది. ఆ సంవత్సరంలోనే వచ్చిన గృహలక్ష్మి కూడా సాంఘికాలకు జీవం ఉందని నిరూపించింది. ఆ చిత్రనిర్మాణంలో ఎక్కువగా పాలుపంచుకున్న ప్రముఖులు ఉత్తమమైన కథలతో ధోరణిలో చిత్రాలు నిర్మించాలని వాహిని పేరు మీద సంస్థ ఆరంభించారు. కథ స్క్రీన్ ప్లే సంగీతం సాహిత్యం ఛాయాగ్రహణం మొదలైన శాఖలు ఉన్నత శ్రేణిలో వుండి సినిమాని నడిపించాలని ఉత్తర దేశ చిత్రాలల్లో వున్నంత నైపుణ్యం చూపించాలని వాహిని - పథకాలు ప్రణాళికలూ వేసుకుని కృషి చేసిందిసత్ఫలితం సాధించింది. బి. ఎన్. రెడ్డి తీసిన వందేమాతరం సుమంగళి దేవత వంటి సాంఘికాలు నేటికీ ఉత్తమ చిత్రాలుగా పరిగణింపబడుతున్నాయి. తెలుగు సినిమా ఆలయానికి ధ్వజస్తంభంగా పేర్కొనదగ్గ కె. వి. రెడ్డి - పోతన వేమన చిత్రాలలో తెలుగు సినిమాకి అంతర్జాతీయ ప్రమాణం కల్పించారు. తర్వాత వచ్చిన చిత్ర నిర్మాణ సంస్థలకు వాహిని ఆదర్శనీయమైంది. వాహిని సంస్థ లేకపోతె తెలుగు సినిమాకి పరిణతే లేదు అన్న విశ్వాసాన్ని పలికించింది.
- రావి కొండలరావు
1932 లో తెలుగు సినిమా పుట్టింది. 1936లో తోలి సాంఘిక చిత్రం ప్రేమవిజయం వచ్చింది. అంత వరకు వచ్చిన పురాణ కథల్ని చుసిన ప్రేక్షకులకి సాంఘికం రుచించలేదు. సాంఘికాలకు కాలంకాదని నిర్మాణ సంస్థలు మౌనం వహించినా సంచలన చిత్రకారుడు గూడవల్లి రామబ్రహ్మం సాంఘికాలకు మళ్లీ గంట కొట్టాడు. 1938లో వచ్చిన మాలపిల్ల ప్రేక్షక మేఘాలచేత కనక వర్షం కురిపించింది. ఆ సంవత్సరంలోనే వచ్చిన గృహలక్ష్మి కూడా సాంఘికాలకు జీవం ఉందని నిరూపించింది. ఆ చిత్రనిర్మాణంలో ఎక్కువగా పాలుపంచుకున్న ప్రముఖులు ఉత్తమమైన కథలతో ధోరణిలో చిత్రాలు నిర్మించాలని వాహిని పేరు మీద సంస్థ ఆరంభించారు. కథ స్క్రీన్ ప్లే సంగీతం సాహిత్యం ఛాయాగ్రహణం మొదలైన శాఖలు ఉన్నత శ్రేణిలో వుండి సినిమాని నడిపించాలని ఉత్తర దేశ చిత్రాలల్లో వున్నంత నైపుణ్యం చూపించాలని వాహిని - పథకాలు ప్రణాళికలూ వేసుకుని కృషి చేసిందిసత్ఫలితం సాధించింది. బి. ఎన్. రెడ్డి తీసిన వందేమాతరం సుమంగళి దేవత వంటి సాంఘికాలు నేటికీ ఉత్తమ చిత్రాలుగా పరిగణింపబడుతున్నాయి. తెలుగు సినిమా ఆలయానికి ధ్వజస్తంభంగా పేర్కొనదగ్గ కె. వి. రెడ్డి - పోతన వేమన చిత్రాలలో తెలుగు సినిమాకి అంతర్జాతీయ ప్రమాణం కల్పించారు. తర్వాత వచ్చిన చిత్ర నిర్మాణ సంస్థలకు వాహిని ఆదర్శనీయమైంది. వాహిని సంస్థ లేకపోతె తెలుగు సినిమాకి పరిణతే లేదు అన్న విశ్వాసాన్ని పలికించింది. - రావి కొండలరావు