నేనెందుకు రాస్తున్నాను? కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను? నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాటు అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ళ ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్ళు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు అనివార్యంగా నా కథల్లోకి వచ్చాయి. పల్లె మధ్యలో నిలబడి ప్రపంచాన్ని దర్శించాను. నేను మా ఊరి మట్టిని కెలుకుతూ మైలపడిన జీవితాలను గుండెకద్దుకుంటున్నాను. మాయమైన చెరువు దిక్కు, ఎండిన వాగు దిక్కు, కరిగిపోతున్న గుట్టల దిక్కు ఇప్పటికీ దిగులుగా చూస్తున్నాను. అవే కథలుగా సమాజానికి నాకు మౌనవారధిని కడుతున్నాను.
- పెద్దింటి అశోక్ కుమార్
నేనెందుకు రాస్తున్నాను? కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను? నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాటు అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ళ ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్ళు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు అనివార్యంగా నా కథల్లోకి వచ్చాయి. పల్లె మధ్యలో నిలబడి ప్రపంచాన్ని దర్శించాను. నేను మా ఊరి మట్టిని కెలుకుతూ మైలపడిన జీవితాలను గుండెకద్దుకుంటున్నాను. మాయమైన చెరువు దిక్కు, ఎండిన వాగు దిక్కు, కరిగిపోతున్న గుట్టల దిక్కు ఇప్పటికీ దిగులుగా చూస్తున్నాను. అవే కథలుగా సమాజానికి నాకు మౌనవారధిని కడుతున్నాను. - పెద్దింటి అశోక్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.