ఎవరు చదివినా చదవకపోయినా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాజుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని "మిలియన్ మార్చ్".
అప్పటి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద "మిలియన్ మార్చ్" చేసి తమ ఆకాంక్షను బలంగా చెప్పాలని యావత్ తెలంగాణ సిద్దమవుతుంది. కానీ ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా లక్షలాది జనం ముందుకు కదిలారు.
దీనికి స్ఫూర్తి ఏమిటి...? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది...? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది...? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ "లంగా మార్చ్".
-పెద్దింటి అశోక్ కుమార్.