కొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. ఏదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ "కాగితం పడవలు" ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి రాసుకున్నాను. నేను చుసిన ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికి మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పదవులు చేశా. ఇక్కడ వదిలిస్తున్న. మీరు ఇదే దార్లో ఉంటె నేనే పంపించానని తెల్సుకొని , తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!