చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ.
నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.
చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ. నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.© 2017,www.logili.com All Rights Reserved.