పరిచయం
ఈ పుస్తకంలో ఉన్న 'పుస్తక పరిచయాలు' అన్నీ 'కొత్త బంగారం' శీర్షికతో | డిసెంబర్ 2017 నుంచీ నవంబర్ 2019 వరకూ ప్రతీ సోమవారం- సాక్షి వార్తాపత్రిక సాహిత్యం పేజీలో 'కృష్ణ వేణి' బైలైన్ లో వచ్చినవి.
కొన్ని రచనలు-అవార్డులు, ప్రైజులూ గెలుచుకున్నవి. మరికొన్ని, ప్రైజుల కోసం షార్ట్ లాంగ్ లిస్ట్ అయినవి. మిగిలినవి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివేవయినా, ఎక్కువ జనాదరణ పొందినవి. ప్రతి కాలమ్ లోనూ - పుస్తకసారం, రచయిత వివరాలు, రచయిత ఎంచుకున్న శైలేకాక సాంకేతిక ప్రక్రియని కూడా ఉదహరించాను.
సామాన్యంగా మనం-మనకి పరిచయం ఉన్న భాష, సంస్కృతి గురించి చదవడానికే ప్రాధాన్యతనిస్తాం. అందుకే, కొత్తల్లో ఇంగ్లిష్ రచనలు మాత్రమే పరిచయం చేశాను. ఆ తరువాత, మనదేశపు ఇతర భాషల ఇంగ్లిష్ అనువాదాలూ, యూరోపియన్ | అరబిక్ / ఉర్దూ భాషాంతరీకరణలూ నా దృష్టికి వచ్చాయి. ఈ తర్జుమాలన్నీ, నాకు భిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన శైలులనూ పరిచయం చేసి, నాకు తెలిసిందే లోకం అన్న భ్రమను దూరం చేశాయి. అయితే, భావోద్వేగాలు మాత్రం ఖండాల తేడాలను గుర్తించవని కూడా నేర్పాయి. వీటిల్లో చాలా పుస్తకాల ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి.
అప్పటికి నా రాతలను పుస్తకంగా తెద్దామన్న ఆలోచనైతే ఉండేది కాదు. ఎప్పుడైతే, నేనేమి రాశానో నేనే మరచిపోయి - అవి ఏ సర్చ్ ఇంజిన్లోనూ దొరక్క పోవడం మొదలయిందో, అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ కాలమ్స్ అన్నీ పుస్తకం రూపం తీసుకోవడానికి కారణం అయింది........
పరిచయం ఈ పుస్తకంలో ఉన్న 'పుస్తక పరిచయాలు' అన్నీ 'కొత్త బంగారం' శీర్షికతో | డిసెంబర్ 2017 నుంచీ నవంబర్ 2019 వరకూ ప్రతీ సోమవారం- సాక్షి వార్తాపత్రిక సాహిత్యం పేజీలో 'కృష్ణ వేణి' బైలైన్ లో వచ్చినవి. కొన్ని రచనలు-అవార్డులు, ప్రైజులూ గెలుచుకున్నవి. మరికొన్ని, ప్రైజుల కోసం షార్ట్ లాంగ్ లిస్ట్ అయినవి. మిగిలినవి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివేవయినా, ఎక్కువ జనాదరణ పొందినవి. ప్రతి కాలమ్ లోనూ - పుస్తకసారం, రచయిత వివరాలు, రచయిత ఎంచుకున్న శైలేకాక సాంకేతిక ప్రక్రియని కూడా ఉదహరించాను. సామాన్యంగా మనం-మనకి పరిచయం ఉన్న భాష, సంస్కృతి గురించి చదవడానికే ప్రాధాన్యతనిస్తాం. అందుకే, కొత్తల్లో ఇంగ్లిష్ రచనలు మాత్రమే పరిచయం చేశాను. ఆ తరువాత, మనదేశపు ఇతర భాషల ఇంగ్లిష్ అనువాదాలూ, యూరోపియన్ | అరబిక్ / ఉర్దూ భాషాంతరీకరణలూ నా దృష్టికి వచ్చాయి. ఈ తర్జుమాలన్నీ, నాకు భిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన శైలులనూ పరిచయం చేసి, నాకు తెలిసిందే లోకం అన్న భ్రమను దూరం చేశాయి. అయితే, భావోద్వేగాలు మాత్రం ఖండాల తేడాలను గుర్తించవని కూడా నేర్పాయి. వీటిల్లో చాలా పుస్తకాల ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. అప్పటికి నా రాతలను పుస్తకంగా తెద్దామన్న ఆలోచనైతే ఉండేది కాదు. ఎప్పుడైతే, నేనేమి రాశానో నేనే మరచిపోయి - అవి ఏ సర్చ్ ఇంజిన్లోనూ దొరక్క పోవడం మొదలయిందో, అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ కాలమ్స్ అన్నీ పుస్తకం రూపం తీసుకోవడానికి కారణం అయింది........© 2017,www.logili.com All Rights Reserved.