ఆకలికి అమ్మంటే భయం. అమ్మ ఇంకా ఆమడదూరంలో ఉండగానే ఆకలి పారిపోయింది.
కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి తన తల్లి రాకను పోల్చుకున్నాడు. అబ్బులు, మిట్టమధ్యాహ్నం అందరికీ నడినెత్తిన సూర్యుడున్నాడు. అమ్మ నెత్తిన మాత్రం అన్నం వుంది. అప్పుడు వీస్తున్న గాలి చల్లగా అనిపించింది. తేలిగ్గా ఉన్న జుట్టును తడిమిపోయింది. పొలం వైపు చూశాడు అబ్బులు. చిన్న చిన్న చెరకు మొక్కల మధ్య తన వాళ్లు అందరూ ఆడవాళ్ళే. కొప్పులూ, చేతులూ కదులుతున్నాయి.
కలుపు తీస్తున్నారు కానీ, కబుర్లు నాటుతున్నారు. మందారాలున్న కొప్పులైతే మాటిమాటికీ ఎగసిపడుతున్నాయి. జాకెట్లు కప్పనంత మేరా వీపులు ఎండకు మెరుస్తున్నాయి. కష్టజీవులకు కడుపు మాడితే తెలుస్తుంది. వీపు మాడితే తెలీదు.
అబ్బులు చిన్న మట్టిబెడ్డ తీసుకుని ఒక వీపుమీద కొట్టాడు. ఒక మందారం వెనక్కి తిరిగింది.
“ఏయ్ బాయ్యా! నీమీసాలు నాకెరుగేగాని యేం కావాలో సెప్పు వడ్డమా? ఇప్పుడు కాలిందన్నమాట కడుపు, ఆ మందారం ఎవరో కాదు. అబ్బులి మరదలే. పేరు సరస్వతి. కానీ ఆరో తరగతి దగరే, బడి మానేసింది. అయినా చదువంటే పిచ్చి కాగితం ముక్క కనిపిస్తే చాలు. అందులోని అక్షరాలు గుణించుకుని, గుణించుకుని చదువుతుంది. ఆహ తెలిసినప్పటి నుండీ అబ్బులు వాళ్ళ ఇంట్లోనే పెరుగుతోంది.
మరదలని వరస కలుపుకున్నారుగానీ, సరస్వతి బాగా దూరపు బంధువుల పిల్ల, పెంచే తాహతు లేక తలిదండ్రులు చిన్నప్పుడే వదులుకున్నారు. అబ్బులు తండ్రి బతికున్నంత వరకూ సరస్వతి స్కూలుకు వెళ్లింది. అబ్బులు తండ్రి పంచాయితీ బోర్డు మెంబరుగా చేసేవాడు. మాలపల్లి మొతానికి ఆయనే నాయకుడు. కామెర్లోచ్చి చనిపోయాడు. అప్పటి నుంచి అబులు తల్లి వెంకమే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. అర ఎకరం పొలమూ, రెండు పాడిగే
దంతలే. వాటిని సరస్వతి పంచుకోవాల్సివచ్చింది.
చక్కబెటుకొచ్చి చనిపోయంబరు అంత...............
ఆకలికి అమ్మంటే భయం. అమ్మ ఇంకా ఆమడదూరంలో ఉండగానే ఆకలి పారిపోయింది. కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి తన తల్లి రాకను పోల్చుకున్నాడు. అబ్బులు, మిట్టమధ్యాహ్నం అందరికీ నడినెత్తిన సూర్యుడున్నాడు. అమ్మ నెత్తిన మాత్రం అన్నం వుంది. అప్పుడు వీస్తున్న గాలి చల్లగా అనిపించింది. తేలిగ్గా ఉన్న జుట్టును తడిమిపోయింది. పొలం వైపు చూశాడు అబ్బులు. చిన్న చిన్న చెరకు మొక్కల మధ్య తన వాళ్లు అందరూ ఆడవాళ్ళే. కొప్పులూ, చేతులూ కదులుతున్నాయి. కలుపు తీస్తున్నారు కానీ, కబుర్లు నాటుతున్నారు. మందారాలున్న కొప్పులైతే మాటిమాటికీ ఎగసిపడుతున్నాయి. జాకెట్లు కప్పనంత మేరా వీపులు ఎండకు మెరుస్తున్నాయి. కష్టజీవులకు కడుపు మాడితే తెలుస్తుంది. వీపు మాడితే తెలీదు. అబ్బులు చిన్న మట్టిబెడ్డ తీసుకుని ఒక వీపుమీద కొట్టాడు. ఒక మందారం వెనక్కి తిరిగింది. “ఏయ్ బాయ్యా! నీమీసాలు నాకెరుగేగాని యేం కావాలో సెప్పు వడ్డమా? ఇప్పుడు కాలిందన్నమాట కడుపు, ఆ మందారం ఎవరో కాదు. అబ్బులి మరదలే. పేరు సరస్వతి. కానీ ఆరో తరగతి దగరే, బడి మానేసింది. అయినా చదువంటే పిచ్చి కాగితం ముక్క కనిపిస్తే చాలు. అందులోని అక్షరాలు గుణించుకుని, గుణించుకుని చదువుతుంది. ఆహ తెలిసినప్పటి నుండీ అబ్బులు వాళ్ళ ఇంట్లోనే పెరుగుతోంది. మరదలని వరస కలుపుకున్నారుగానీ, సరస్వతి బాగా దూరపు బంధువుల పిల్ల, పెంచే తాహతు లేక తలిదండ్రులు చిన్నప్పుడే వదులుకున్నారు. అబ్బులు తండ్రి బతికున్నంత వరకూ సరస్వతి స్కూలుకు వెళ్లింది. అబ్బులు తండ్రి పంచాయితీ బోర్డు మెంబరుగా చేసేవాడు. మాలపల్లి మొతానికి ఆయనే నాయకుడు. కామెర్లోచ్చి చనిపోయాడు. అప్పటి నుంచి అబులు తల్లి వెంకమే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. అర ఎకరం పొలమూ, రెండు పాడిగే దంతలే. వాటిని సరస్వతి పంచుకోవాల్సివచ్చింది. చక్కబెటుకొచ్చి చనిపోయంబరు అంత...............© 2017,www.logili.com All Rights Reserved.