వాసిరెడ్డి సీతాదేవి కథాసాహిత్యం
“నా సాహిత్య నేపథ్యం ఏ గొప్ప పుస్తకాలు కావు - గొప్ప మేధావుల సత్ సాంగత్యంకాదు. కేవలం నా చుట్టూ ఉన్న ప్రపంచం - నా లోపలి ప్రపంచం - రెండు సంఘర్షించినప్పుడు. తలెత్తిన ప్రశ్నలకు అందిన సమాధానాలే - నా సాహిత్యానికి నేపథ్యం" అని స్పష్టం చేసిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఇంకా 'సాహితీ జీవితం నా జీవితం వేరు కాదు' అని కూడా
సీతాదేవి కథలకు వస్తువులు తాను సూసిన, తాను తెలుసుకొన్న, తన అనుభవంలోకి వచ్చిన విషయాలే.
చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం నెలకొని వున్న చేబ్రోలులో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే ఒక ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నే ఆమె గుండెను పిండింది. 'కోనేట్లో ఆడవాళ్ళ శవాలే ఎందుకు తేల్తాయి? మగవాళ్ళ శవాలు ఎందుకు తేలవు!?' అనేదే ఆ ప్రశ్న. తన చుట్టూ ఉన్న భౌతిక వాస్తవికతను, దాని వెనుకవున్న స్త్రీ జీవన దుఃఖాన్ని ఆమె తన చిన్ననాడే కనుగొన్నది. ఆమెలో ఒక తాత్విక చింతనను ఇటువంటి ప్రశ్నలు నెలకొల్పాయి. అందుకే ఆమె కథలలో స్త్రీల వేదనలు, రోదనలు కనిపిస్తాయి, వినిపిస్తాయి.
దాదాపు వంద కథలు రాసిన సీతాదేవి కథలలో యాభై కథలను ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనవరి 2002లో సంపుటిగా ప్రచురించింది. అందునుంచి ఎంపిక చేసినవే ఈ పది కథలు. సీతాదేవి కథలు సామాజిక సత్యాలు, సీతాదేవి కథలు జీవితంలోంచి వచ్చినవే. సీతాదేవి కథలకు వాస్తవికతే పునాది. సీతాదేవి సాహిత్యానికి ఒక నిర్దుష్ట ప్రయోజనం వుండాల న్నారు. 'గాలికథ' (1985)లను తిరస్కరించారు. 1980 దశకంలో తెలుగు నవలా సాహిత్యంలో ఒక పెనుప్రమాదం లేపిన క్షుద్రరచనల మీద, అటువంటి అహేతుకత రచనలు చేసిన క్షుద్ర రచయితలమీద 'గాలికథ'లో సీతాదేవి నిప్పులు చెరిగారు. తీవ్రమైన దాడి చేశారు.
"నువ్వు వాళ్ళందరికంటే పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటువి. డబ్బుకోసం, సెక్సు కోసం నేరాలు చేసేవాళ్ళకంటే నువ్వేమీ తీసిపోవు. నీ రాతల్లో మిథేల్ ఆల్కహాల్ ఉంది. నువ్వు తాగిన విస్కీలో మిథేల్ ఆల్కహాల్ కలిపిన వాడెంత నేరస్తుడో నువ్వూ అంత నేరస్తుడివే. ఇది ఇన్స్టెంట్ నీది పాయిజన్. వాడు కలిపిన విషంతో చచ్చేది తాగడానికి అలవాటు పడినవాళ్ళే......................
వాసిరెడ్డి సీతాదేవి కథాసాహిత్యం “నా సాహిత్య నేపథ్యం ఏ గొప్ప పుస్తకాలు కావు - గొప్ప మేధావుల సత్ సాంగత్యంకాదు. కేవలం నా చుట్టూ ఉన్న ప్రపంచం - నా లోపలి ప్రపంచం - రెండు సంఘర్షించినప్పుడు. తలెత్తిన ప్రశ్నలకు అందిన సమాధానాలే - నా సాహిత్యానికి నేపథ్యం" అని స్పష్టం చేసిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఇంకా 'సాహితీ జీవితం నా జీవితం వేరు కాదు' అని కూడా సీతాదేవి కథలకు వస్తువులు తాను సూసిన, తాను తెలుసుకొన్న, తన అనుభవంలోకి వచ్చిన విషయాలే. చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం నెలకొని వున్న చేబ్రోలులో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే ఒక ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నే ఆమె గుండెను పిండింది. 'కోనేట్లో ఆడవాళ్ళ శవాలే ఎందుకు తేల్తాయి? మగవాళ్ళ శవాలు ఎందుకు తేలవు!?' అనేదే ఆ ప్రశ్న. తన చుట్టూ ఉన్న భౌతిక వాస్తవికతను, దాని వెనుకవున్న స్త్రీ జీవన దుఃఖాన్ని ఆమె తన చిన్ననాడే కనుగొన్నది. ఆమెలో ఒక తాత్విక చింతనను ఇటువంటి ప్రశ్నలు నెలకొల్పాయి. అందుకే ఆమె కథలలో స్త్రీల వేదనలు, రోదనలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. దాదాపు వంద కథలు రాసిన సీతాదేవి కథలలో యాభై కథలను ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనవరి 2002లో సంపుటిగా ప్రచురించింది. అందునుంచి ఎంపిక చేసినవే ఈ పది కథలు. సీతాదేవి కథలు సామాజిక సత్యాలు, సీతాదేవి కథలు జీవితంలోంచి వచ్చినవే. సీతాదేవి కథలకు వాస్తవికతే పునాది. సీతాదేవి సాహిత్యానికి ఒక నిర్దుష్ట ప్రయోజనం వుండాల న్నారు. 'గాలికథ' (1985)లను తిరస్కరించారు. 1980 దశకంలో తెలుగు నవలా సాహిత్యంలో ఒక పెనుప్రమాదం లేపిన క్షుద్రరచనల మీద, అటువంటి అహేతుకత రచనలు చేసిన క్షుద్ర రచయితలమీద 'గాలికథ'లో సీతాదేవి నిప్పులు చెరిగారు. తీవ్రమైన దాడి చేశారు. "నువ్వు వాళ్ళందరికంటే పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటువి. డబ్బుకోసం, సెక్సు కోసం నేరాలు చేసేవాళ్ళకంటే నువ్వేమీ తీసిపోవు. నీ రాతల్లో మిథేల్ ఆల్కహాల్ ఉంది. నువ్వు తాగిన విస్కీలో మిథేల్ ఆల్కహాల్ కలిపిన వాడెంత నేరస్తుడో నువ్వూ అంత నేరస్తుడివే. ఇది ఇన్స్టెంట్ నీది పాయిజన్. వాడు కలిపిన విషంతో చచ్చేది తాగడానికి అలవాటు పడినవాళ్ళే......................© 2017,www.logili.com All Rights Reserved.