సంగీత సాహిత్యాలను అపారంగా ప్రేమించే వీరలక్ష్మిదేవి అపురూపమైన హృదయంతో రాసిన ఈ కథలనిండా అనేకమంది స్త్రీలు, వారంతా పురుషాధిక్య సమాజపు సంకెళ్ళలో బంధితులై అణిగిపోయినవారు కారు. తమ జీవనోత్సాహాన్ని కాపాడుకుంటూ తామున్న చోటును నివాసయోగ్యంగానే కాక, అందమైన తోటలా చేసుకున్నవాళ్ళు. తమ ఆశయాలను కాపాడుకున్న వాళ్ళు, జీవితపు ఆటుపోట్లకు తట్టుకుని తల ఎత్తుకొని నిలబడ్డవాళ్ళు, ఎక్కువ చదువులూ, పెద్ద ఉద్యోగాలు లేకపోయినా తమకి స్వభావ సిద్ధంగా వచ్చిన స్తిమితాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకున్న వాళ్ళూను...
జీవితాన్ని ప్రేమించు, మనుషుల్ని వాళ్ళని వాళ్ళుగా ప్రేమించు. సకల ప్రకృతినీ దగ్గరికి తీసుకో. నీ చుట్టుపక్కలంతా జాజిపూల పరిమళాన్ని వెదజల్లు. దైనందిన జీవితం తప్పనిసరిగా కాక, దాన్ని అ కూని రాగంలో ఆలపించు. ఈ క్రమంలో నీ గౌరవాన్ని నిలుపుకో. అది ముఖ్యం. ఇదీ ఆమె జీవనదృక్పథం. ఇక కథా విమర్శకులు అందరూ చెప్పే క్లుప్తతా, గాధతా, సంఘర్షణా, సరైన నేపధ్యం అన్నీ చక్కగా అమరిన కథలు ఇవి.
- పి.సత్యవతి
సంగీత సాహిత్యాలను అపారంగా ప్రేమించే వీరలక్ష్మిదేవి అపురూపమైన హృదయంతో రాసిన ఈ కథలనిండా అనేకమంది స్త్రీలు, వారంతా పురుషాధిక్య సమాజపు సంకెళ్ళలో బంధితులై అణిగిపోయినవారు కారు. తమ జీవనోత్సాహాన్ని కాపాడుకుంటూ తామున్న చోటును నివాసయోగ్యంగానే కాక, అందమైన తోటలా చేసుకున్నవాళ్ళు. తమ ఆశయాలను కాపాడుకున్న వాళ్ళు, జీవితపు ఆటుపోట్లకు తట్టుకుని తల ఎత్తుకొని నిలబడ్డవాళ్ళు, ఎక్కువ చదువులూ, పెద్ద ఉద్యోగాలు లేకపోయినా తమకి స్వభావ సిద్ధంగా వచ్చిన స్తిమితాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకున్న వాళ్ళూను... జీవితాన్ని ప్రేమించు, మనుషుల్ని వాళ్ళని వాళ్ళుగా ప్రేమించు. సకల ప్రకృతినీ దగ్గరికి తీసుకో. నీ చుట్టుపక్కలంతా జాజిపూల పరిమళాన్ని వెదజల్లు. దైనందిన జీవితం తప్పనిసరిగా కాక, దాన్ని అ కూని రాగంలో ఆలపించు. ఈ క్రమంలో నీ గౌరవాన్ని నిలుపుకో. అది ముఖ్యం. ఇదీ ఆమె జీవనదృక్పథం. ఇక కథా విమర్శకులు అందరూ చెప్పే క్లుప్తతా, గాధతా, సంఘర్షణా, సరైన నేపధ్యం అన్నీ చక్కగా అమరిన కథలు ఇవి. - పి.సత్యవతి© 2017,www.logili.com All Rights Reserved.