ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలా కాలంగా లోలోన ఉగ్గబట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంగతులనేకం ఉన్నట్లనిపించింది. దాటాల్సిన అగడ్తలెన్నో ఉన్నాయని, కొంచెం కొంచెంగానైనా సంకోచాలని వదిలి నేను చెప్పాలనుకుంటున్న సంగతులేవో చెప్పాలనిపించింది.
కథల లోకంలోకి నేను అడుగులేస్తూ, ఇవి కథలేనా అని సంకోచపడుతున్న వేళ నల్లపిల్ల నవ్వు చదివి ఇది కథేనన్న తొలి భరోసానిచ్చిన నవ్య సందేహంతో అప్పుడప్పుడూ గుడిపాటి, నవీన్, పాపినేని, మధురాంతకం నరేంద్ర, వసంత లక్ష్మీ, సుంకోజి దేవేంద్రాచారి, ఖదీర్, రాజగోపాల్ గార్లను నిర్మొహమాటంగా విమర్శించండి అంటూ, వాళ్ళతో సాగించిన సంభాషణలు కథలు రాసే పని నేను కూడా చేయవచ్చన్న నమ్మకాన్నిచ్చాయి.
ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలా కాలంగా లోలోన ఉగ్గబట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంగతులనేకం ఉన్నట్లనిపించింది. దాటాల్సిన అగడ్తలెన్నో ఉన్నాయని, కొంచెం కొంచెంగానైనా సంకోచాలని వదిలి నేను చెప్పాలనుకుంటున్న సంగతులేవో చెప్పాలనిపించింది. కథల లోకంలోకి నేను అడుగులేస్తూ, ఇవి కథలేనా అని సంకోచపడుతున్న వేళ నల్లపిల్ల నవ్వు చదివి ఇది కథేనన్న తొలి భరోసానిచ్చిన నవ్య సందేహంతో అప్పుడప్పుడూ గుడిపాటి, నవీన్, పాపినేని, మధురాంతకం నరేంద్ర, వసంత లక్ష్మీ, సుంకోజి దేవేంద్రాచారి, ఖదీర్, రాజగోపాల్ గార్లను నిర్మొహమాటంగా విమర్శించండి అంటూ, వాళ్ళతో సాగించిన సంభాషణలు కథలు రాసే పని నేను కూడా చేయవచ్చన్న నమ్మకాన్నిచ్చాయి.© 2017,www.logili.com All Rights Reserved.