అవును.. ఇవి కొత్త కథలు.. సరికొత్త కథలు.. ఏ కథకి ఆ కథే ప్రత్యేకమైనది. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్న, వినూత్న గొంతుల మేలిమి కలయిక ఈ కొత్త కథ - 2017. ఇందులో ఉన్న రచయితలలో ఎప్పటి నుంచో రాస్తున్న లబ్ధప్రతిష్టులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని అబ్బురపరుస్తున్న కొత్త కథకులు ఉన్నారు. ఎప్పుడో కానీ రాయని విలువైన రచయితలూ ఉన్నారు. ఎజెండాలూ, జడ్జిమెంట్లు లేని సంపాదకులుగా ఉండాలని మా ప్రయత్నం. వెరసి తెలుగు కథ ఎన్నెన్ని వైరుధ్యాల్ని పట్టుకోగలదో చూడాలనుకున్నాం. ప్రేమ, ప్రేమ రాహిత్యం, చీకటి బతుకులు, పల్లె పెడుతున్న కన్నీరు, నగర జీవన సంగ్రామం, యిదమిద్ధంగా ఇదీ అని చెప్పలేని భావసాంద్రత ఈ సంకలనంలో చూడవచ్చు.
- కుప్పిలి పద్మ
అవును.. ఇవి కొత్త కథలు.. సరికొత్త కథలు.. ఏ కథకి ఆ కథే ప్రత్యేకమైనది. సమకాలీన తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్న, వినూత్న గొంతుల మేలిమి కలయిక ఈ కొత్త కథ - 2017. ఇందులో ఉన్న రచయితలలో ఎప్పటి నుంచో రాస్తున్న లబ్ధప్రతిష్టులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని అబ్బురపరుస్తున్న కొత్త కథకులు ఉన్నారు. ఎప్పుడో కానీ రాయని విలువైన రచయితలూ ఉన్నారు. ఎజెండాలూ, జడ్జిమెంట్లు లేని సంపాదకులుగా ఉండాలని మా ప్రయత్నం. వెరసి తెలుగు కథ ఎన్నెన్ని వైరుధ్యాల్ని పట్టుకోగలదో చూడాలనుకున్నాం. ప్రేమ, ప్రేమ రాహిత్యం, చీకటి బతుకులు, పల్లె పెడుతున్న కన్నీరు, నగర జీవన సంగ్రామం, యిదమిద్ధంగా ఇదీ అని చెప్పలేని భావసాంద్రత ఈ సంకలనంలో చూడవచ్చు. - కుప్పిలి పద్మ© 2017,www.logili.com All Rights Reserved.