బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. తెలుగు కథకు తాత్విక స్పర్శ అద్దిన గొప్ప కథకుడు. ఈనాడు ఏ సామాజిక అంశంపైనైనా సాధికారికంగా రాసే, మాట్లాడే స్థాయిలో మనకున్న సాహితీ వేత్తలలో బి ఎస్ రాములు ఒకరు. తెలంగాణ భూమికతో భారతీయ అంతరాత్మను సామాజిక ఆర్ధిక చరిత్రను తమ రచనల్లో ఆవిష్కరిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆయన తెలుగు సాహిత్యంలో కథకుడిగా, తాత్వికుడిగా, విశ్లేషకుడిగా సాగుతున్న ప్రస్థానంలో తనదైన సొంత ముద్రతో జీవన ప్రవాహంలో ఎదురైన రాళ్ళు, రప్పల్ని, డొంకల్ని దాటుకుంటూ పయనిస్తున్న అలుపెరుగని బాటసారి.
ఒక ఉద్యమంలా ప్రారంభమైన వీరి రచనల ప్రభావంతో వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు, పార్టీలు, ఉద్యమాలు కొత్త పోరాటరూపాలు తీసుకున్నాయి. కథలు, నవలలు, వందలాది సైద్దాంతిక, సామాజిక రచనలు, 89 పుస్తకాలు ప్రచురించారు. అవి తెలుగునాట భావజాల చర్చను మలుపుతిప్పాయి. బి ఎస్ రాములు ఒక నిరంతర ఉద్యమ చైతన్యం. ఈ తరానికి మార్గదర్శకులు. వారొక కథల బడి, జీవన తత్వనిది. ప్రస్తుతం ఆధునిక తెలుగు సామాజిక చరిత్ర, సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం గురించి విస్తృతంగా రాస్తున్నారు.
బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. తెలుగు కథకు తాత్విక స్పర్శ అద్దిన గొప్ప కథకుడు. ఈనాడు ఏ సామాజిక అంశంపైనైనా సాధికారికంగా రాసే, మాట్లాడే స్థాయిలో మనకున్న సాహితీ వేత్తలలో బి ఎస్ రాములు ఒకరు. తెలంగాణ భూమికతో భారతీయ అంతరాత్మను సామాజిక ఆర్ధిక చరిత్రను తమ రచనల్లో ఆవిష్కరిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆయన తెలుగు సాహిత్యంలో కథకుడిగా, తాత్వికుడిగా, విశ్లేషకుడిగా సాగుతున్న ప్రస్థానంలో తనదైన సొంత ముద్రతో జీవన ప్రవాహంలో ఎదురైన రాళ్ళు, రప్పల్ని, డొంకల్ని దాటుకుంటూ పయనిస్తున్న అలుపెరుగని బాటసారి. ఒక ఉద్యమంలా ప్రారంభమైన వీరి రచనల ప్రభావంతో వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు, పార్టీలు, ఉద్యమాలు కొత్త పోరాటరూపాలు తీసుకున్నాయి. కథలు, నవలలు, వందలాది సైద్దాంతిక, సామాజిక రచనలు, 89 పుస్తకాలు ప్రచురించారు. అవి తెలుగునాట భావజాల చర్చను మలుపుతిప్పాయి. బి ఎస్ రాములు ఒక నిరంతర ఉద్యమ చైతన్యం. ఈ తరానికి మార్గదర్శకులు. వారొక కథల బడి, జీవన తత్వనిది. ప్రస్తుతం ఆధునిక తెలుగు సామాజిక చరిత్ర, సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం గురించి విస్తృతంగా రాస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.