'కొత్త దుప్పటి' లోని కథలు పుట్టుకథలు. రచయిత పుట్టి, పెరిగిన ప్రాంతం కథలు. ప్రధానంగా కడప జిల్లా బద్వేలు తాలూకా, కాశినాయని మండలంలోని బాలరాజుపల్లె చుట్టూపక్కల మట్టిలోంచి పుట్టిన కథలు. సిద్దయ్యమఠం, బ్రహ్మంగారి మఠం, కాశినాయన స్థలం పరిసరాల్లో పుట్టిన కథలు. అక్కడి నేలల రూపం, రంగు, రుచి, వాసన తెలిసి రాసిన కథలు. ఈ కథల్లో అక్కడి సామాజిక నిరసన కవుల స్వరం ఉంది.
అక్కడి కొండలూ, కోనలూ, వాగులూ వంకలూ, చెరువులూ, కుంటలూ, కాలువలూ గుండాలూ, చెట్లు చేమలూ, మెరకలూ బరకలూ, గడ్డీ గాదమూ, గొడ్డు గోదా, పిట్టలూ గిట్టలూ, పైర్లూ పచ్చలూ, వానావంగడీ, తిండీతిప్పలూ, కులాలూ గిలాలూ, కరువులూ కాటకాలూ, కక్షలూ కార్పణ్యాలూ, మంచీచెడూ, ఆటలూ పాటలూ, భాషాయాసా ఉన్నాయి. అవి ఈ కథల వాతావరణ చిత్రణలో ఇమిడిపోయాయి. నల్లమల, సగిలేరు, జ్యోతివాగు ప్రాంతాల నైసర్గిక సామాజిక జీవనగతులూ, ఘర్షణలూ ఈ కథలకు ప్రాణభూతంయ్యాయి. జీవధాతువులయ్యాయి.
'కొత్త దుప్పటి' లోని కథలు పుట్టుకథలు. రచయిత పుట్టి, పెరిగిన ప్రాంతం కథలు. ప్రధానంగా కడప జిల్లా బద్వేలు తాలూకా, కాశినాయని మండలంలోని బాలరాజుపల్లె చుట్టూపక్కల మట్టిలోంచి పుట్టిన కథలు. సిద్దయ్యమఠం, బ్రహ్మంగారి మఠం, కాశినాయన స్థలం పరిసరాల్లో పుట్టిన కథలు. అక్కడి నేలల రూపం, రంగు, రుచి, వాసన తెలిసి రాసిన కథలు. ఈ కథల్లో అక్కడి సామాజిక నిరసన కవుల స్వరం ఉంది. అక్కడి కొండలూ, కోనలూ, వాగులూ వంకలూ, చెరువులూ, కుంటలూ, కాలువలూ గుండాలూ, చెట్లు చేమలూ, మెరకలూ బరకలూ, గడ్డీ గాదమూ, గొడ్డు గోదా, పిట్టలూ గిట్టలూ, పైర్లూ పచ్చలూ, వానావంగడీ, తిండీతిప్పలూ, కులాలూ గిలాలూ, కరువులూ కాటకాలూ, కక్షలూ కార్పణ్యాలూ, మంచీచెడూ, ఆటలూ పాటలూ, భాషాయాసా ఉన్నాయి. అవి ఈ కథల వాతావరణ చిత్రణలో ఇమిడిపోయాయి. నల్లమల, సగిలేరు, జ్యోతివాగు ప్రాంతాల నైసర్గిక సామాజిక జీవనగతులూ, ఘర్షణలూ ఈ కథలకు ప్రాణభూతంయ్యాయి. జీవధాతువులయ్యాయి.© 2017,www.logili.com All Rights Reserved.