ఈ సంపుటంలోని కథానికలలో దాదాపు అన్నీ వ్యక్తుల ప్రవృత్తి మూలకంగా ఉత్పన్నమయి క్రమంగా కుటుంబానికీ సమూహానికీ సమాజానికీ సంక్రమించిన సమస్యా బీజాలని చెప్పవచ్చు. వీటిని ఎక్కడికక్కడ, ఏ స్థాయిలో ఉన్నవాటిని ఆ స్థాయిలో విశ్లేషించుకోవచ్చు. పరిష్కరించుకోవచ్చు. కాని అంత స్తిమితత్వం ఎవరికీ లేదు. అందువల్ల సమస్యాపాశాన్ని తెగేదాకా లాగుతారు. ఇది వివేకవంతుల లక్షణం కాదని అందరికీ తెలుసు. కాని వాస్తవంలో జరుగుతున్నది.
ఈ సంపుటంలో ఉన్న ఓ కథలో ఒక విశేషముంది. ఇది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రభావాన్ని వస్తువుగా తీసుకొని రచించినది. స్వార్థ ప్రయోజనపర రాజకీయ ద్వేషాగ్ని శిఖల పెల్లుబికి ఏళ్ల తరబడిగా లావాను వెలిగక్కుతూ కాలికింది భూమి బద్దలు కావడాన్ని మన తరంలో చూడవలసి రావడం చాలా పెద్ద విషాదం!. బహుముఖ ప్రజ్ఞావంతురాలు, బహు ప్రక్రియా నిర్వాహ కౌశల సంపన్నురాలు అయిన గోరిలక్ష్మిగారి కథానికలు లోతుగా ఆలోచింపజేస్తాయి; అవగాహన పరిధిని పెంచుతాయి; అనుభూతిని గాడతరం చేస్తాయి. ఆమె కథానికలు అందరికీ కావలసినవి; కనుక ఆమె అందరికీ 'కావలసినవారు'. వారిని మనసారా అభినందిస్తున్నాను; ఉజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను.
- పోరంకి దక్షిణామూర్తి
ఈ సంపుటంలోని కథానికలలో దాదాపు అన్నీ వ్యక్తుల ప్రవృత్తి మూలకంగా ఉత్పన్నమయి క్రమంగా కుటుంబానికీ సమూహానికీ సమాజానికీ సంక్రమించిన సమస్యా బీజాలని చెప్పవచ్చు. వీటిని ఎక్కడికక్కడ, ఏ స్థాయిలో ఉన్నవాటిని ఆ స్థాయిలో విశ్లేషించుకోవచ్చు. పరిష్కరించుకోవచ్చు. కాని అంత స్తిమితత్వం ఎవరికీ లేదు. అందువల్ల సమస్యాపాశాన్ని తెగేదాకా లాగుతారు. ఇది వివేకవంతుల లక్షణం కాదని అందరికీ తెలుసు. కాని వాస్తవంలో జరుగుతున్నది. ఈ సంపుటంలో ఉన్న ఓ కథలో ఒక విశేషముంది. ఇది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రభావాన్ని వస్తువుగా తీసుకొని రచించినది. స్వార్థ ప్రయోజనపర రాజకీయ ద్వేషాగ్ని శిఖల పెల్లుబికి ఏళ్ల తరబడిగా లావాను వెలిగక్కుతూ కాలికింది భూమి బద్దలు కావడాన్ని మన తరంలో చూడవలసి రావడం చాలా పెద్ద విషాదం!. బహుముఖ ప్రజ్ఞావంతురాలు, బహు ప్రక్రియా నిర్వాహ కౌశల సంపన్నురాలు అయిన గోరిలక్ష్మిగారి కథానికలు లోతుగా ఆలోచింపజేస్తాయి; అవగాహన పరిధిని పెంచుతాయి; అనుభూతిని గాడతరం చేస్తాయి. ఆమె కథానికలు అందరికీ కావలసినవి; కనుక ఆమె అందరికీ 'కావలసినవారు'. వారిని మనసారా అభినందిస్తున్నాను; ఉజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను. - పోరంకి దక్షిణామూర్తి© 2017,www.logili.com All Rights Reserved.