రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ రచించిన పుస్తకాల తెలుగు అనువాదాలు పునర్ ముద్రించే అవకాశం మాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాం.
లియో టాల్ స్టాయ్ 1828 సెప్టెంబర్ 9 న రష్యా సామ్రాజ్యంలో "తుల" ప్రావెన్స్ లో " యస్నా పోలియానా" అనే గ్రామంలో గల ఎస్టేట్ లో జన్మించారు. అయన కుటుంబం రాచరిక సంబంధాలు కల్గిన జమీందారి కుటుంబం. అయన పుట్టిన సంవత్సరానికి తల్లి, ఏడూ సంవత్సరాలకు తండ్రి కూడా చనిపోయారు. పెంపకపు తల్లి దగ్గర పెరిగాడు. యవ్వనంలో జులాయిగా తిరిగి, తరువాత కజాన్ యూనివర్సిటీలో మొదట న్యాయశాస్త్రం లోనూ తరువాత ఫిలోసోఫీలోనూ చేరి చివరికి పూర్తి చేయకుండానే తిరిగి తన ఎస్టేట్ కి వచ్చేసారు. అప్పటిలో రష్యా - క్రిమియా యుద్ధకాలంలో సైన్యంలో చేరి పని చేసారు.
-ఆర్వీయార్.