"వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదు" అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విస్పష్టమైన విధాన ప్రకటన చేశారు. తద్వారా ప్రభుత్వ రంగంపట్ల తనకున్న దృక్పధాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలపట్ల మోడీ గారి భావజాలాన్ని అర్ధం చేసుకోవడానికి కాస్త మూలాల్లోకి వెళ్ళి శోధించాలి. హిందుత్వ భావజాలాన్ని ప్రభోదిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ గారు చేసిన ప్రవచనాల సంకలనం పాంచజన్యం , ఆరవ అధ్యాయం "మన కార్య లక్ష్యం" శీర్షికతో ప్రచురించబడిన భాగంలో ఇలా పేర్కొనబడి ఉన్నది. "సంక్షేమ రాజ్యమని చెప్పకుంటూ మన ప్రభుత్వం శక్తిని, అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకొని విద్యా, వైద్య, సదుపాయాలు, సామజిక జీవితం, ఉత్పత్తి, పంపిణి మొదలైన జీవన రంగాలన్నీ తన ఛత్రచ్చయాల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నది.